సంక్రాంతి రేసులోకి ఎంట్రీ ఇవ్వనున్న బాలయ్య?
అయితే భారీ అంచనాలతో రిలీజైన అఖండ2 అంచనాలను అందుకోలేకపోయింది. డే1, ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్లు వచ్చినప్పటికీ తర్వాత మాత్రం కలెక్షన్లు నెమ్మదించాయి.
By: Sravani Lakshmi Srungarapu | 3 Jan 2026 3:24 PM ISTఅఖండ2 తాండవం. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డివోషనల్ యాక్షన్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజు నుంచి వారం ఆలస్యంగా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటం, పైగా బాలయ్య- బోయపాటి కాంబినేషన్ కావడంతో అఖండ2పై మొదటి నుంచి అందరికీ భారీ అంచనాలున్నాయి.
అంచనాలను అందుకోలేకపోయిన అఖండ2
అయితే భారీ అంచనాలతో రిలీజైన అఖండ2 అంచనాలను అందుకోలేకపోయింది. డే1, ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్లు వచ్చినప్పటికీ తర్వాత మాత్రం కలెక్షన్లు నెమ్మదించాయి. అలా అని అఖండ2 పని అక్కడితో అయిపోలేదు. ఇప్పటికీ అఖండ2 బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా పెర్ఫార్మ్ చేస్తుంది. సినిమాకు మంచి కలెక్షన్లే వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ భారీగా ఉండటంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైందని అంటున్నారు.
సంక్రాంతి సినిమాల వరకే అఖండ2 థియేట్రికల్ రన్
సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో అప్పటివరకు అఖండ2 బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు కలెక్షన్లు అయినా దక్కుతాయి. కానీ ఎప్పుడైతే సంక్రాంతి సినిమాల హంగామా మొదలవుతుందో అప్పట్నుంచి అఖండ2 రన్ పూర్తవడం ఖాయం. మరి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న అఖండ2 ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
జనవరి 9న ఓటీటీలోకి అఖండ2
ఈ నేపథ్యంలోనే జనవరి 9 నుంచి అఖండ2 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ముందు అనుకున్న డీల్ ప్రకారమైతే అఖండ2 జనవరి 2న ఓటీటీలోకి రావాల్సింది కానీ సినిమా డిసెంబర్ 5 నుంచి 12కు వాయిదా పడటంతో ఈ డీల్ కూడా జనవరి 9కి మారిందని తెలుస్తోంది. అయితే ఎక్కువగా సంక్రాంతికి తన సినిమాలను రిలీజయ్యేలా చూసుకునే బాలయ్య ఈ సంక్రాంతిని మిస్ అయ్యారని ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్న నేపథ్యంలో ఇప్పుడు బాలయ్య కూడా సంక్రాంతి రేసులోకి సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ రాజా సాబ్, చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు సంక్రాంతికి థియేటర్లలో రిలీజవనుండగా, బాలకృష్ణ అఖండ2 మాత్రం సంక్రాంతి కానుకగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇంట్లోనే ఉండి సినిమాలు చూసే ఆడియన్స్ కు అఖండ2 మంచి ఆప్షన్ కానుంది.
