నైజాం టాప్ ఓపెనర్స్.. అఖండ 2 పొజిషన్ ఎంత?
అలా పైజాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ టాప్ ప్లేస్ లో ఉంది. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
By: M Prashanth | 13 Dec 2025 12:25 PM ISTబ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందిన అఖండ 2 తాండవం మూవీ ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఆ సినిమా.. డిసెంబర్ 12వ తేదీ విడుదలైంది. ముందు రోజు ప్రీమియర్స్ కూడా పడగా.. వాటి ద్వారా రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు ఇటీవల తెలిపారు.
అందులో నైజాం ఏరియాను కూడా కలిపి ప్రకటించారు. అయితే నైజాం ప్రాంతం.. తెలుగు చిత్రాలకు బెస్ట్ కలెక్షన్లు సాధించే ఏరియా అనే చెప్పాలి. ఇప్పుడు అక్కడ అఖండ.. తొలి రోజు రూ.7.05 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే నైజాంలో టాప్ షేర్ కలెక్షన్లు సాధించిన సినిమాలేంటి? అఖండ 2 పొజిషన్ ఎంత?
టాప్ షేర్ సాధించిన సినిమాలు లిస్ట్ ఇలా!
పుష్ప 2: రూల్ - రూ. 25.60 కోట్లు
ఓజీ- రూ.24.45 కోట్లు
ఆర్ఆర్ఆర్- రూ.23.35 కోట్లు
దేవర పార్ట్ 1- రూ. 22.64 కోట్లు
సలార్ - రూ. 22.55 కోర్టు
కల్కి 2898 ఏడీ - రూ.19.60 కోట్లు
గుంటూరు కారం - రూ.16.45 కోట్లు
ఆదిపురుష్ - రూ.13.68 కోట్లు
హరిహర వీరమల్లు - రూ.12.40 కోట్లు
సర్కారు వారి పాట - రూ.12.24 కోట్లు
భీమ్లా నాయక్ - రూ.11.85 కోట్లు
పుష్ప పార్ట్ 1 - రూ.11.44 కోట్లు
గేమ్ ఛేంజర్ - రూ.10.94 కోట్లు
రాధే శ్యామ్ - రూ.10.80 కోట్లు
సాహో - రూ.9.41 కోట్లు
బాహుబలి 2- రూ.8.9 కోట్లు
వకీల్ సాబ్ - రూ.8.75 కోట్లు
సరిలేరు నీకెవ్వరు- రూ.8.67Cr
బ్రో -రూ. 8.45 కోట్లు
సైరా నరసింహారెడ్డి -రూ. 8.10 కోట్లు
ఆచార్య - 7.90 కోట్లు
అఖండ 2 తాండవం- రూ.7.05 కోట్లు
అలా పైజాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ టాప్ ప్లేస్ లో ఉంది. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. నైజాంలో కూడా దుమ్మురేపింది. ఆ తర్వాత స్థానాల్లో ఓజీ, ఆర్ఆర్ఆర్, దేవర, సలార్ సహా పలు సినిమాలు ఉన్నాయి. అఖండ రూ.7.09 కోట్లతో 22వ స్థానంలో ఉంది.
ఇక అఖండ 2 సినిమా విషయానికొస్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన మూవీని 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. బాలయ్య కుమార్తె తేజస్విని ప్రెజెంటర్ గా వ్యవహరించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా.. ఆది పినిశెట్టి విలన్ గా యాక్ట్ చేశారు. తమన్ మ్యూజిక్ అందించారు.
