అఖండ2 కోసం మధ్యప్రదేశ్ లో భారీ ఏర్పాట్లు
అఖండ మూవీతో పలు రికార్డులు బ్రేక్ చేసిన బాలయ్య-బోయపాటి ద్వయం ఇప్పుడు ఈ మూవీతో మరిన్ని రికార్డులు సృష్టించాలని చూస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 1 Nov 2025 12:17 PM ISTకొన్ని సినిమాలకు సంబంధించిన విషయాలు షూటింగ్ టైమ్ లోనే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటాయి. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి విషయాలు ఎక్కువగా జరుగుతూంటాయి. ఎవరూ, ఎప్పుడూ షూటింగ్ చేయని లొకేషన్లలో సినిమాలను తీయడమో లేదంటే కొత్త టెక్నీషీయన్లను రంగంలోకి దింపడం లాంటివి చేయడంతోనో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఆడియన్స్ అటెన్షన్ ను తెచ్చుకుంటూ ఉంటాయి.
అఖండ పేరిట పలు రికార్డులు
ఇప్పుడు అఖండ2 సినిమా కూడా అలానే పలు విషయాల్లో వార్తల్లో నిలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ2. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచి అందరికీ భారీ అంచనాలున్నాయి. అఖండ మూవీతో పలు రికార్డులు బ్రేక్ చేసిన బాలయ్య-బోయపాటి ద్వయం ఇప్పుడు ఈ మూవీతో మరిన్ని రికార్డులు సృష్టించాలని చూస్తున్నారు.
నవంబర్ 3 నుంచి భారీ సాంగ్ షూటింగ్
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా, మూవీ ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. అఖండ2లో ఓ భారీ సాంగ్ ను ప్లాన్ చేయగా, నవంబర్ 3 నుంచి నాలుగు రోజుల పాటూ ఆ పాటను మధ్యప్రదేశ్ లో దీన్ని షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
అఖండ2లో ఎన్నో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్
ఇప్పటికే అఖండ2 కోసం మహా కుంభమేళాకు వెళ్లి కొన్ని షాట్స్ ను తెరకెక్కించిన బోయపాటి ఆ తర్వాత చాలా ఎక్కువ మంది డ్యాన్సర్లతో ఓ సాంగ్ ను షూట్ చేశారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఓ భారీ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. చూస్తుంటే అఖండ2 లో ఆడియన్స్ ను సర్‌ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ చాలానే ఉన్నట్టు అనిపిస్తోంది. ఆల్రెడీ ఈ మూవీ గురించి టాలీవుడ్ లోని యంగ్ హీరోలంతా తెగ మాట్లాడుకుంటున్నారని, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అని వెయిట్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండగా, తమన్ అఖండ2కు సంగీతం అందిస్తున్నారు.
