Begin typing your search above and press return to search.

ఆ భాషలో కూడా అఖండ 2.. నార్త్ లో మేకర్స్ అదిరే ప్లాన్!

నటసింహం బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

By:  M Prashanth   |   25 Nov 2025 8:00 PM IST
ఆ భాషలో కూడా అఖండ 2.. నార్త్ లో మేకర్స్ అదిరే ప్లాన్!
X

నటసింహం బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. థియేటర్స్ లో కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన ఆ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత హిందీ డబ్బింగ్ వెర్షన్ ఓటీటీ, యూట్యూబ్ లో నార్త్ వాళ్లను తెగ ఆకట్టుకుంది.

ఇప్పుడు అదే సీన్ ను అఖండ సీక్వెల్ కు కూడా రిపీట్ చేయాలని చూస్తున్నారు. అప్పుడు థియేటర్స్ లో హిందీ వెర్షన్ రిలీజ్ చేయని మేకర్స్..ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను రూపొందిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. నార్త్ లో కూడా పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు.

అయితే అవధి భాషలో కూడా అఖండ 2: తాండవం మూవీని విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మన చిత్రాలు ఇప్పటి వరకు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ తదితర భాషల్లో డబ్ అయ్యి రావడం సాధారణమే. కానీ అవధి భాషలో ఇప్పటివరకు ఏ తెలుగు చిత్రం డబ్బింగ్ అవ్వలేదు.

ఇప్పుడు ఆ ఫీట్ అందుకున్న తొలి మూవీగా అఖండ 2 నిలవనుందనే చెప్పాలి. అయితే అవధి భాష ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని అవధ్ ప్రాంతం, మధ్యప్రదేశ్, బీహార్ లోని కొన్ని ప్రాంతాల్లో మాట్లాడుకుంటారు. ఆయా ఏరియాల్లో అఖండకు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఇప్పుడు అఖండ-2ను మేకర్స్ డబ్ చేస్తున్నారని టాక్.

అందుకు గాను ఇప్పటికే అవధి లాంగ్వేజ్ వెర్షన్ డబ్బింగ్ కోసం ప్రత్యేకంగా రైటర్స్ టీమ్‌ ను నియమించి, అక్కడి ప్రాంతీయ శైలికి సరిపోయే పదాలు ఎంపిక చేసినట్లు సమాచారం. సినిమాలోని బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్‌ కు అవధి ఫ్లేవర్ కలిస్తే.. అక్కడి ప్రేక్షకులను సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారట.

అదే సమయంలో సౌత్ సినిమాలకు నార్త్ లో ఇటీవల బాగా పెరిగిన క్రేజ్‌ ను దృష్టిలో పెట్టుకుని అనేక తెలుగు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ అవధి వంటి ప్రాంతీయ భాషలో అఖండ 2 విడుదల చేయడం ఒక కొత్త ప్రయోగం. అది సక్సెస్ అయితే…మరిన్ని పెద్ద చిత్రాలు ఆ రూట్ లో వెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనా నార్త్ లోని మరో కొత్త మార్కెట్ కు చేరువయ్యే దిశగా అఖండ మేకర్స్ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు చర్చనీయాంశమైంది.