Begin typing your search above and press return to search.

అఖండ-2 వచ్చేదెప్పుడు? ఓటీటీ 'బెస్ట్' ఆప్షన్ అదేనా?

టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ 2: తాండవం మూవీ రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   6 Dec 2025 11:47 AM IST
అఖండ-2 వచ్చేదెప్పుడు? ఓటీటీ బెస్ట్ ఆప్షన్ అదేనా?
X

టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ 2: తాండవం మూవీ రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ అఖండకు సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమా.. డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ నిర్మాణ సంస్థ ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడం వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.

కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేయగా.. ఆ తేదీ కోసం అటు సినీ ప్రియులు.. ఇటు బాలయ్య అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాతలు.. ఆర్థిక అడ్డంకులను తొలగించుకునే పనిలో బిజీగా ఉన్నారు. మద్రాసు హైకోర్టు స్టే ఎత్తేశాక.. సినిమాను గ్రాండ్ గా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందోనన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు సినిమాకు ఉన్న మూడు ఆప్షన్లు.. డిసెంబ‌రు 12, డిసెంబ‌రు 19, డిసెంబ‌రు 25. వాటిలో చివరి డేట్ ను అఖండకు బెస్ట్ ఆప్షన్ అని ఇప్పుడు అంతా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 12వ తేదీన అనేక చిన్న సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి.

వాటితో పోటీ లేకపోయినా.. ఆయా చిత్రాలను డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది. 19వ తేదీన అవతార్-3 రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లో స్క్రీన్స్ విషయంలో ఇబ్బంది వస్తుంది. కాబట్టి డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అనేక మంది చెబుతున్నారు. అఖండ-2 ఓటీటీ పార్టనర్ కూడా అదే చెప్పిందట.

ఇప్పటికే ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్.. క్రిస్మస్ కు విడుదల చేయాలని సజ్జెస్ట్ చేసిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో అతి త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. అయితే క్రిస్మస్ కానుకగా పలు టాలీవుడ్ చిత్రాలు.. థియేటర్స్ లో రిలీజ్ అవ్వనున్నట్లు ఆయా మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

యంగ్ హీరో ఆది సాయి కుమార్, మరో యువ కథానాయకుడు రోషన్ శంభాల, ఛాంపియన్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పతంగ్, దండోరా లాంటి చిన్న సినిమాలు కూడా క్రిస్మస్ కానుకగా రానున్నాయి. మరి ఇప్పుడు అఖండ-2.. క్రిస్మస్ స్లాట్ ను ఫిక్స్ చేసుకుంటే ఆయా చిత్రాల రిలీజ్ షెడ్యూల్ లో మార్పు జరగనుండడం పక్కా అనే చెప్పాలి. మరేం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజుల పాటు వేచి చూడాలి.