రిలీజ్ కు ముందే మరో రెండు బ్లాస్ట్ లా?
ప్రీమియర్‌కి ముందుగా జూక్‌బాక్స్ నుండి ఒకటి లేదా రెండు ట్రాక్స్‌లను లిరికల్ వీడియోలుగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
By: Srikanth Kontham | 1 Dec 2025 1:56 PM IST`అఖండ 2` మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందకు రాబోతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న బాలయ్య తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఉత్తరాదిలో సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనాలున్నాయి.
అందుకు తగ్గట్టే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతీ ప్రచార చిత్రం అంతకంతకు మంచి హైప్ తీసుకొచ్చింది. ప్రాజెక్ట్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకూ సినిమాపై ఎక్కడా హైప్ తగ్గలేదు. ప్రచార చిత్రాలు ..లిరికల్ సాంగ్స్ ప్రతీది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. తాజాగా ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఇప్పుడు ఏకంగా జ్యూక్ బాక్స్ ని రిలీజ్ చేసారు.
సినిమాలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. కొంత కాలంగా ఆడియో రిలీజ్ ఈవెంట్లకు బధులు ప్రీ రిలీజ్ పేరుతో ఈవెంట్లు జరగడంతో? ఆడియో హైలైట్ అవ్వడం లేదు. అంతకు ముందే లిరికల్ సింగిల్స్ రిలీజ్ చేయడంతో? బిగ్ సీడీలు లాంటివి కనిపించలేదు. మారిన ట్రెండ్ కు అనుగుణంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా `అఖండ2 ` కంప్లీట్ జ్యూక్ బాక్స్ ను మార్కెట్లో అందుబా టులోకి వచ్చేసింది. ఇప్పటికే `థాండవం` ,` జాజీకాయ` పాటలు రిలీజ్ అయ్యాయి. వాటికి శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రీమియర్‌కి ముందుగా జూక్‌బాక్స్ నుండి ఒకటి లేదా రెండు ట్రాక్స్‌లను లిరికల్ వీడియోలుగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ అయితే అవి మ్యూజిక్ ప్రియులకు కనెక్ట్ అయితే? రిలీజ్ తర్వాత కలిసొస్తుందన్నది మేకర్స్ ప్లాన్ కావొచ్చు. ఈసినిమాకి పాటలు రచించిన వారు..వాటిని ఆలపించిన వారు వీరే..
కల్యాణ్ చక్రవర్తి రచించిన `అఖండ తాండవం` పాటను సర్వెపల్లి సిస్టర్స్ ఆలపించారు. ఇంకా అధ్వితీయ వొజ్జల రచించిన `గంగాధర శంకర` పాటను ఎస్. ఐశ్వర్య, ఎస్. సౌందర్య, శృతి రంజని పాడారు. `శివ శివ` పాటను కల్యాణ్ చక్రవర్తి రచించగా గొట్టే కణకవ్వ, శృతి రంజని ఆలపించారు. `హర హర` పాటను ఎస్.పి. చరణ్, శ్రీ కృష్ణ పాడారు.`శంకర శంకర` గీతాన్ని వి. ఎం. మహాలింగమ్, దివ్య కుమార్, దీపక్ బ్లూ, అరుణ్ కౌండిన్య ఆలపించారు.
`శంభో` పాటను ఆద్వతీయ వొజ్జల రచించగా, ఎస్. ఐశ్వర్య, ఎస్. సౌందర్య తో పాటు వొజ్జల పాడారు.`అఖండ హిందువం` పాటను నాగ గురునాధశర్మ రంచిచగా, సర్వెపల్లి సిస్టర్స్ పాడారు. `హే తాండవం` పాటను శంకర్ మహాదేవన్, కైలాస్ ఖేర్, దీపక్ బ్లూ ఆలపించగా, `జాజికయ` పాటను కాసర్య శ్యాం రచించగా బ్రిజేష్ సందిల్య, శ్రేయా ఘోషాల్ పాడారు.
