Begin typing your search above and press return to search.

బాలయ్యకు రికార్డు బిజినెస్.. మరి రికార్డు హిట్?

ఇప్పుడు ఆయన్నుంచి ‘అఖండ-2’ రాబోతోంది. ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా. నిర్మాతలు దీని మీద ఏకంగా రూ.150 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

By:  Garuda Media   |   1 Dec 2025 10:51 PM IST
బాలయ్యకు రికార్డు బిజినెస్.. మరి రికార్డు హిట్?
X

నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. కానీ మధ్యలో ఆయన మార్కెట్ బాగా దెబ్బ తింది. ఓ మోస్తరు హిట్టు కోసం కూడా ఏళ్లతరబడి వేచి చూసిన పరిస్థితి. అలాంటి టైంలో ‘సింహా’తో బాలయ్యను తిరిగి రేసులోకి తీసుకొచ్చిన ఘనత బోయపాటి శ్రీనుదే. వీరి కలయికలో ఆ తర్వాత వచ్చిన లెజెండ్, అఖండ కూడా పెద్ద హిట్లయ్యాయి.

ఇప్పుడు ఆయన్నుంచి ‘అఖండ-2’ రాబోతోంది. ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా. నిర్మాతలు దీని మీద ఏకంగా రూ.150 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే బిజినెస్ కూడా రికార్డు స్థాయిలోనే జరిగింది. అన్ని హక్కులూ కలిపి రూ.200 కోట్లకు పైగానే తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ కూడా రూ.150 కోట్ల మేర జరిగినట్లు అంచనా. రెండు తెలుగు రాష్ట్రాల టార్గెట్ రూ.120 కోట్ల మేర జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాంలో రూ.30 కోట్లు, సీడెడ్లో రూ.25 కోట్లు, ఆంధ్రాలో రూ.55 కోట్ల మేర ఈ సినిమాకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమా రూ.200 కోట్ల దాకా గ్రాస్ రాబట్టాల్సి ఉంది. హిందీ హక్కులకు, అలాగే ఓవర్సీస్ రైట్స్‌కు కూడా మంచి రేటే వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.300 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంది ‘అఖండ-2’.

మామూలుగా అయితే బాలయ్య రేంజికి అది చాలా పెద్ద టార్గెట్టే. కానీ మిగతా సినిమాలు వేరు, అఖండ వేరు. దీనికి పాన్ ఇండియా అప్పీల్ ఉండడం, సీక్వెల్ క్రేజ్ కూడా తోడవుతుండడంతో పాజిటివ్ టాక్ వస్తే ఈ టార్గెట్ అందుకోవడం కష్టమేమీ కాదు. ఈ సినిమా బాలయ్య కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ కావడం లాంఛనమే. బాక్సాఫీస్ దగ్గర కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి టాక్ బాగుంటే ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్‌గానూ ‘అఖండ-2’ రికార్డు నెలకొల్పే అవకాశాలున్నాయి.