సెకండాఫ్ లో ఆ మూవ్ మెంట్సే సర్ ప్రైజ్
అఖండ చూసినప్పుడు ఏదైతే ఆడియెన్ కి కనెక్టయి ఉందో ఆ పాత్రను అఖండ 2లో హైలైట్ గా చూపించారు బోయపాటి. కథను నడిపించేది అఘోరా పాత్ర. దానినే సెకండాఫ్‌లోను మరింత హైలైట్ చేసాం.
By: Sivaji Kontham | 1 Dec 2025 9:35 AM ISTనందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా బోయపాటి తెరకెక్కించిన `అఖండ 2- తాండవం` ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఇది బహు భాషలలో విడుదల కానుంది. అఖండ- 2 కథ వేదాల గొప్పతనం, హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది కాబట్టి ప్రతి భారతీయుడికి నచ్చుతుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
హిందూ సనాతన ధర్మంపై ఇది ప్రత్యేకమైన సినిమా ఇది. నిజానికి అఖండ చిత్రం విడుదలైనప్పుడు అభిమానులతో పాటు, కామన్ ఆడియెన్ కి బాగా కనెక్టయిన ఎలిమెంట్ హిందూ సమాజ ధర్మం. ఇప్పుడు బోయపాటి దీనిని మరో లెవల్ కి తీసుకెళ్లారని సినిమా చూసిన నిర్మాతలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట మాట్లాడుతూ-ఈ చిత్రంలో విజిల్స్ వేసే మూవ్ మెంట్స్ ఉంటాయి.. కంటెంట్ బాగా వర్కవుటైంది. బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఇందులో ఆకట్టుకుంటాయి.. అని తెలిపారు. ఇది మాస్ కి ఎక్కే సినిమానా? అని ప్రశ్నించగా, అన్ని సెక్షన్ల ప్రజలు చూస్తేనే సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. కేవలం మాస్, ఫ్యాన్స్ చూస్తేనే ఆదాయం రాదని నిర్మాతలు పేర్కొన్నారు.
సెకండాఫ్ లో ఆ మూవ్ మెంట్సే సర్ ప్రైజ్
అఖండ చూసినప్పుడు ఏదైతే ఆడియెన్ కి కనెక్టయి ఉందో ఆ పాత్రను అఖండ 2లో హైలైట్ గా చూపించారు బోయపాటి. కథను నడిపించేది అఘోరా పాత్ర. దానినే సెకండాఫ్‌లోను మరింత హైలైట్ చేసాం. అది కాకుండా యువకుడిగా కనిపించే బాలయ్య పాత్ర అలరిస్తుంది. అయితే దీనిని ఎక్కువగా హైలైట్ చేయలేదు. జనం ల్యాగ్ అని ఫీలయ్యే ఫ్రేమ్‌లు ఈ సినిమాలో కనిపించవు. అఖండ 2లో యంగ్ పాత్ర ఉంటుంది.. కానీ అఘోరా పాత్ర రావడంతోనే ఊపు పెరుగుతుంది.. అది హైలైట్ గా ఉంటుందని నిర్మాతలు తెలిపారు.
వదిలించేసుకున్నాం అంటే కుదరదు: రామ్ ఆచంట
ఏదో సినిమా తీసాం.. అమ్మేసాం.. వదిలించుకున్నాం! అనేది కాకుండా పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు కూడా సంతోషంగా ఉండాలని మేము నమ్ముతాం. మంచి కంటెంట్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు కూడా కంటెంట్ విషయంలో నమ్మకంగా ఉన్నామని తెలిపారు.
ఎలక్షన్ ముందు ప్లాన్:
బాలయ్య బాబు - బోయపాటి మేం కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాం. నిజానికి అప్పట్లో ఎలక్షన్స్ ముందు చేయాలని అనుకున్నాం. దానికోసం రెడీ చేసిన కథ వేరు. కానీ సమయం సరిపోదని భావించి అప్పుడు మరో కొత్త సబ్జెక్ట్ అనుకున్నాం. అలా అఖండ 2 ప్రారంభమైంది. అఖండ 2 భారతదేశం అంతా ఎక్కడైనా చూసే, నచ్చే కంటెంట్ తో తెరకెక్కిందని నిర్మాతలు వెల్లడించారు.
