Begin typing your search above and press return to search.

అఖండ 2: బోయపాటి చెప్పిన దాంట్లో అసలు నిజముందా?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గా రిలీజైన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   2 Jan 2026 11:03 AM IST
అఖండ 2: బోయపాటి చెప్పిన దాంట్లో అసలు నిజముందా?
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గా రిలీజైన విషయం తెలిసిందే. సనాతన ధర్మం, దైవిక అంశాలతో తెరకెక్కిన ఆ చిత్రం.. డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్స్ లో రిలీజైంది.

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కడంతో అఖండ 2 తాండవంపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా భారీ హిట్ గా నిలుస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక కంటెంట్ అందరినీ ఆకట్టుకోలేదు. కేవలం అభిమానులను విశేషంగా మెప్పించింది.

కానీ కామన్ ఆడియన్స్ ను అనుకున్నంత రేంజ్ లో అట్రాక్ట్ చేయలేదు. దీంతో సినిమా వసూళ్లపై అందరి ఫోకస్ పడింది. ఓపెనింగ్స్ తో పాటు మొదటి కొన్ని రోజుల పాటు మంచి వసూళ్లు రావడంతో.. మూవీ రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కలెక్షన్లు డ్రాప్ అవుతుండడంతో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయడం కష్టమేనని చెప్పాలి.

ఇంతలో బోయపాటి శ్రీను.. ఏకంగా సినిమాకు సంబంధించిన డబ్బులు మొత్తం వచ్చేశాయని ఇటీవల తెలిపారు. అఖండ 2ను బిజినెస్ కోణంలో చూడకూడదని అన్నారు. డబ్బుకు ఎలాంటి సమస్య లేదని, పెట్టిన పెట్టుబడి ఇప్పటికే తిరిగి వచ్చేసిందని ఆయన చెప్పారు. ఇంకేముంది.. బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేశారు.

కానీ బోయపాటి చెప్పిన దాంట్లో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే డైరెక్టర్ కామెంట్స్ కు.. బయ్యర్ల ప్రస్తుత వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉంది. అనేక మంది బయ్యర్లు భారీ నష్టాలను చవి చూశారని సమాచారం. ముఖ్యంగా వైజాగ్ కొనుగోలుదారు సతీష్.. అఖండ 2కి గాను సుమారు రూ.6 కోట్ల నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

గుంటూరు బయ్యర్ వెంకట్ సుమారు రూ.3 కోట్లు నష్టపోయినట్లు సమాచారం. కృష్ణా జిల్లా బయ్యర్ సాయి కొర్రపాటి దాదాపు రూ.3 కోట్లు నష్టపోగా, తూర్పు గోదావరి బయ్యర్ విజయలక్ష్మి ఫిల్మ్స్ సుమారు రూ.4 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిసింది. నైజాం తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా సినిమాకు భారీ నష్టాలు వచ్చాయని టాక్.

దీంతో వారంతా ఇప్పుడు మేకర్స్ జీఎస్టీ రీఫండ్‌ లు ఇస్తారని ఎదురుచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటి వల్ల బయ్యర్స్ కు నష్టాలు కొంత వరకు తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పటికే నష్టాలు వచ్చి బాధపడుతున్నట్లు తెలుస్తుండగా.. బోయపాటి శ్రీను డబ్బులు తిరిగి వచ్చేశాయనడం చెప్పడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి!