మార్వెల్ సూపర్ హీరోలతో అఖండ.. ఎంత బాగుందో..
డిసెంబర్ 5వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో అఖండ సీక్వెల్ రిలీజ్ కానుండగా.. మేకర్స్ సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు.
By: M Prashanth | 25 Nov 2025 12:31 PM ISTఅఖండ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన ఆ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా అఖండ 2: తాండవం తెరకెక్కుతుండగా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
డిసెంబర్ 5వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో అఖండ సీక్వెల్ రిలీజ్ కానుండగా.. మేకర్స్ సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి తమ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ముంబై, వైజాగ్, చిక్కబళ్లాపూర్ లో ఈవెంట్స్ జరగ్గా.. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ తో బాలయ్య కనిపించారు.
సినిమాలో అఖండ ఉపయోగించే త్రిశూలాన్ని బాలయ్య బహూకరించగా.. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇప్పుడు మార్వెల్ సూపర్ హీరోలతో అఖండ కనిపించి సందడి చేశారు.. ఏంటి నిజమేనా అని షాకయ్యారా? అది నిజమే.. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, హల్క్, థోర్ తో అఖండ ఉన్న మూమెంట్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందులో బాలయ్య ఆలయం నుంచి వస్తుండగా.. మార్వెల్ నలుగురు హీరోలు జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తారు. ఆ తర్వాత యాక్షన్ సీక్వెన్స్ లో అఖండ చితక్కొడుతుండగా.. వారంతా వెనుక నుంచి గట్టిగా ఎంకరేజ్ చేస్తారు.
చివర్లో అంతా కలిసి బాలయ్య ధ్యానం చేస్తుండగా.. మార్వెల్ హీరోలు మోకాలిపై కూర్చుంటారు. ఆ తర్వాత శివ లింగానికి పూజలు చేస్తారు. అయితే ఇదంతా రియల్ గా జరిగినది కాదు.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సాధ్యమైంది. ఒక బాలయ్య అభిమాని.. దాన్ని AI లో ఎడిట్ చేసి పోస్ట్ చేయగా.. ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే మార్వెల్ హీరోలతో బాలయ్య ఉన్న వీడియో అదిరిపోయిందని అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అలా చూస్తుంటే అదిరిపోయే ఫీలింగ్ వస్తుందని చెబుతున్నారు. ఆ ఊహా ఎంత బాగుందోనని అంటున్నారు. అదే సమయంలో మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు. మూవీపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు ఉండగా.. ఎలాంటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి
