పార్టీ సాంగ్ లో సింహం చిందులు!
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ -2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 18 Sept 2025 2:00 PM ISTనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ -2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ కల్లా అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలని పట్టుబట్టి పని చేస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనే ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు తగట్టే యూనిట్ షూటింగ్ కి సంబంధించి అన్ని పనులు పూర్తి చేస్తోంది. ఇప్పటికే మేజర్ ప్టార్ అంతా పూర్తయింది. పాటలు సహా కొంత భాగం మిగిలి ఉంది. ప్రస్తుతం యూనిట్ ఆ పెండింగ్ షూట్ ని ముగించే పనిలో బిజీగా ఉంది.
పార్టీ సాంగ్ తో పేంపరింగ్:
ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం మేకర్స్ ఓ పార్టీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. నేటి నుంచే ఈ పాట షూట్ మొదలైంది. ఈ పాట కోసం హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా ఓ స్పెషల్ సెట్ వేసి అందులోనే మొదలు పెట్టారు. వారం రోజలు పాటు ఈ పాట చిత్రీకరణ ఉంటుంది. ఈ వ్యవధిలోనే పెండింగ్ సన్నివేశాలు కూడా పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది. అందుకు సంబంధించి మరో టీమ్ పని చేస్తోంది. ఇక పాట విషయానికి వస్తే హిందుత్వం కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్నచిత్రంలో పార్టీ సాంగ్ అన్నది ఇంట్రెంస్టింగ్.
చర్చ లేకుండా సైలెంట్ గా:
బాలయ్య చిత్రంలో ఎలాగూ డ్యెయెల్ రోల్ పోషిస్తారు. అందులో ఓ రోల్ కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగుతోంది. ఆ పాత్రలో కుటుంబం..సమాజాన్ని కాపాడే పాత్రలో బాలయ్య కనిపిస్తారు. ఆ పాత్రలో నవ రసాలు ఉంటాయి. అందులో భాగంగా బాలయ్య పై ఈ పార్టీ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ పార్టీ సాంగ్లో నర్తించే బ్యూటీ ఎవరు? అన్నది ఆసక్తికరం. బాలయ్యపై ఇలాంటి సాంగ్ అంటే ఐంటం భామ కూడా అంతే ఫేమస్ అవ్వాలి. కానీ `అఖండ` కాన్సెప్ట్ కావడంతో ఇంత వరకూ ఐటం పాటకు సంబంధించి పెద్దగా చర్చ ఎక్కడా జరగలేదు.
థమన్ దరువేస్తాడు:
సినిమా ఆరంభం నుంచి ముగిపు వరకూ కుంభమేళా, కాశీ, గుడులు గోపురాలు అనే ప్రచారమే హైలైట్ అయింది. ఐటం పాట ఉంటుంది? అన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. తాజా లీక్ మాస్ అభిమానుల్లో హుషారును నింపేదే. బాలయ్య సినిమా అంటే ఐటం సాంగ్ తప్పనిసరి. అందులో బాలయ్య ఐటం భామతో పోటీ పడే డాన్సులు అంతే హైలైట్. పైగా థమన్ సంగీతం అందిస్తున్న సినిమా కాబట్టి పార్టీ సాంగ్ ఎలా ఉంటుంది? అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
