Begin typing your search above and press return to search.

ఇది బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్!

ఇక అఖండ 2 చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అంశం బడ్జెట్. బాలయ్య కెరీర్ లో ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాలను మించి ఈ సినిమాకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని సమాచారం.

By:  M Prashanth   |   20 Aug 2025 12:13 AM IST
ఇది బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్!
X

టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో ఎప్పటికప్పుడు తన సినిమాలతో కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న హీరో నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ విజయానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 - తాండవం సినిమా ప్రస్తుతం భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

అఖండ సినిమాతో బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ ఎంతటి మాస్ హంగామా సృష్టించిందో తెలిసిందే. అదే కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 గురించి ఇప్పటి నుంచే హైప్ ఆకాశాన్నంటుతోంది. ట్రేడ్ వర్గాలు, ఆడియన్స్ ఇద్దరూ ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద బాలయ్య కెరీర్ బెస్ట్ రికార్డులు నమోదు చేసే చిత్రంగా భావిస్తున్నారు. ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలలో ఇంతటి స్కేల్లో సినిమా రావడం అరుదు.

ఇక అఖండ 2 చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అంశం బడ్జెట్. బాలయ్య కెరీర్ లో ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాలను మించి ఈ సినిమాకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ 185 నుండి 200 కోట్ల రూపాయల మధ్య బడ్జెట్ కేటాయించారని టాక్. సీనియర్ హీరోల సినిమాల్లో ఇంత పెద్ద బడ్జెట్ కేటాయించడం కొత్త రికార్డే అని చెప్పాలి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి, విస్తృత స్థాయిలో విడుదల చేయడానికి కూడా భారీ స్థాయి ఖర్చు జరుగుతోంది.

ఈ స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు రికవరీపై సందేహాలు సహజమే. కానీ నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే ఇప్పటికే సినిమా మంచి రెవెన్యూ సాధించిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా మేకర్స్ కు సాలిడ్ రికవరీ కచ్చితమని అంటున్నారు. అంతేకాదు, థియేట్రికల్ బిజినెస్ లో కూడా అఖండ 2కి భారీ డిమాండ్ ఉందని ట్రేడ్ టాక్.

బాలయ్య కెరీర్ లో ఇది అతిపెద్ద బడ్జెట్ సినిమా కావడంతో, ఆయన ఇమేజ్, బోయపాటి మార్క్ యాక్షన్, అఖండ బ్రాండ్ కలిసొస్తే రికార్డులు తప్పక సొంతం చేస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. మాస్ ఆడియన్స్ కు కావలసిన ఎలిమెంట్స్ అన్నీ అఖండ 2లో ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి, అఖండ 2 తాండవం బాలయ్య కెరీర్ లోనే కాకుండా, టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల్లోనూ ఒక రికార్డ్ అవుతుందనే నమ్మకం ఉంది. భారీ బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్, ఫ్యాన్స్ లో హైప్ అన్నీ కలిసొస్తే ఈ ఏడాది చివర్లో బాలయ్య బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం.