అఖండ 2 బాక్సాఫీస్ డే 1.. బ్రేక్ చేయాల్సిన మొదటి ఛాలెంజ్
నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ గర్జనకు సమయం ఆసన్నమైంది. 'అఖండ 2' టిక్కెట్ కౌంటర్ల వద్ద కూడా హడావుడి కనిపిస్తోంది.
By: M Prashanth | 12 Dec 2025 9:32 AM ISTనందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ గర్జనకు సమయం ఆసన్నమైంది. 'అఖండ 2' టిక్కెట్ కౌంటర్ల వద్ద కూడా హడావుడి కనిపిస్తోంది. అఖండ మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ వల్ల, ఈ సీక్వెల్ మీద అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, జనరల్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి బాలయ్య ముందు ఉన్న టార్గెట్ చిన్నది కాదు.
ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో, అత్యధిక బిజినెస్ తో రిలీజ్ అవుతోంది. దానికి తగ్గట్టే టికెట్ రేట్లు కూడా భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రీమియర్స్ కు ఫ్లాట్ గా రూ. 600 రేటు ఫిక్స్ చేయడం కొంత రిస్కీనే అయినా గత సినిమాలతో పోలిస్తే సేఫ్ గేమ్. అలాగే రెగ్యులర్ షోలకు కూడా రేట్ల పెంపు ఉంది. అందులోనూ రిలీజ్ డేట్ మారడం. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనింగ్స్ పై ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ బుకింగ్స్ పరిస్థితి చూస్తుంటే అంతగా ప్రభావం కనిపించలేదని అనిపిస్తుంది. డీసెంట్ ఓపెనింగ్స్ తోనే సినిమా కొనసాగుతోంది.
దీనికి ప్రధాన కారణం ఆడియెన్స్ లో ఉన్న 'నమ్మకం'. బాలయ్య బోయపాటి కాంబినేషన్ మీద ఉన్న భరోసా, ఆ డివోషనల్ కంటెంట్ మీద ఉన్న ఆసక్తి.. ఈ రేట్లను కూడా దాటి జనాన్ని థియేటర్లకు రప్పిస్తోంది. ఇదే ఈ సినిమాకున్న అసలైన బలం. ప్రస్తుతం బాలయ్య కెరీర్ లో 'డాకు మహారాజ్' సినిమా రూ. 51 కోట్ల గ్రాస్ తో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డును కలిగి ఉంది. ఇప్పుడు 'అఖండ 2' ముందున్న అసలు లక్ష్యం ఆ రికార్డును బద్దలు కొట్టడమే.
ప్రస్తుతం జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, సినిమా టాక్ తో సంబంధం లేకుండానే ఓపెనింగ్స్ లో ఆ రికార్డును క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ ఈరోజు పాజిటివ్ టాక్ డోస్ పెరిగితే, రేపు బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. అదే జరిగితే తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్ల గ్రాస్ మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇది బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ అవుతుంది. ఈ నెంబర్ రీచ్ అయితే బాలయ్య మాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అవుతుంది. ఫైనల్ గా ఎన్నో అడ్డంకుల తరువాత అఖండ 2 బాక్సాఫీస్ వేట మొదలైంది. రేట్ల పెంపు, భారీ అంచనాల మధ్య బాలయ్య తన పాత రికార్డులను ఎలా అధిగమిస్తారో, 'డాకు మహారాజ్' సెట్ చేసిన బెంచ్ మార్క్ ను ఎంత తేడాతో దాటుతారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
