Begin typing your search above and press return to search.

అఖండ 2 వాళ్లకి ఎక్కిందంటే మాత్రం..?

అఖండ సక్సెస్ అవ్వడంతో బోయపాటి శ్రీను బాలయ్య అఖండ 2 తాండవం చేశారు. సింహా నుంచి ఈ కాంబో సినిమా ఎప్పుడొచ్చినా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా డిజప్పాయింట్ చేయలేదు.

By:  Ramesh Boddu   |   23 Nov 2025 7:00 PM IST
అఖండ 2 వాళ్లకి ఎక్కిందంటే మాత్రం..?
X

అఖండ సక్సెస్ అవ్వడంతో బోయపాటి శ్రీను బాలయ్య అఖండ 2 తాండవం చేశారు. సింహా నుంచి ఈ కాంబో సినిమా ఎప్పుడొచ్చినా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా డిజప్పాయింట్ చేయలేదు. ఆ హైప్ తోనే అఖండ 2 సినిమా వస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయడం తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ముంబై నుంచే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. డిసెంబర్ 5న రిలీజ్ అవబోతున్న అఖండ 2 సినిమా ట్రైలర్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

తెలుగు రెండు రాష్ట్రాల్లో బాలయ్య క్రేజ్..

మరోసారి బాక్సాఫీస్ పై బాలయ్య తాండవం ఆడేందుకు వచ్చేస్తున్నాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే ఈ సినిమా సక్సెస్ అనిపించుకోవాలంటే దాదాపు 200 కోట్ల దాకా కలెక్ట్ చేయాలని తెలుస్తుంది. ఐతే తెలుగు రెండు రాష్ట్రాల్లో బాలయ్య క్రేజ్ తెలుసు కాబట్టి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ అదిరిపోతాయి. ఐతే ఈ భారీ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే కేవలం తెలుగు మార్కెట్ కాదు హిందీలో కూడా అఖండ 2 అదిరిపోవాలి. హిందీ బెల్ట్ లో సినిమా ఆడితేనే కలెక్షన్స్ బాగుంటాయి.

అఖండ 2 సినిమా ప్రమోషన్స్ ముంబైలో మొదలు పెట్టిన రీజన్ కూడా అదే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఈమధ్య తెలుగులో తెరకెక్కిన సినిమాలు పాన్ ఇండియా రిలీజైతే హిందీలో హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు కలెక్షన్స్ మోత మోగిపోతాయి. సో అఖండ 2 కూడా ఆ అంచనాలను అందుకుంటుందా అనే ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.

బాలయ్య అఘోరి లుక్ తో పూనకాలు..

అదీగాక అఖండ 2 సినిమాలో బాలయ్య అఘోరి లుక్ తో పూనకాలు తెప్పించేలా ఉన్నారు . అఖండ సినిమా హిందీ డైరెక్ట్ రిలీజ్ కాకపోయినా ఆ సినిమా డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఆ బజ్ తోనే అఖండ 2 ని హిందీలో డైరెక్ట్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

ఇక బోయపాటి శ్రీను యాక్షన్ సినిమాలకు హిందీలో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన తీసిన సరైనోడు, జయ జానకి నాయకా సినిమాలు యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబట్టాయి. సో బీ టౌన్ హిందీ ప్రియులకు బాగా దగ్గరైన బోయపాటి శ్రీను అఖండ 2 తాండవం తో వస్తున్నాడు కాబట్టి ఏమాత్రం సినిమా వాళ్లను టచ్ చేసినా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి. సో 200 కాదు సినిమా హైప్ కి తగినట్టుగానే డివోషనల్ టచ్ ఇంకా యాక్షన్ పార్ట్ అంతా కుదిరితే మరో 100 కోట్లు తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

బాలయ్య కూడా అఖండ 2 తాండవంతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తుండగా.. నెక్స్ట్ గోపీచంద్ మలినేని సినిమాను కూడా ఇదే రేంజ్ నేషనల్ వైడ్ రిలీజ్ చేసేలా ప్లాన్ ఉందట. ఆదిత్య 999 కూడా భారీ రేంజ్ స్కెచ్ తోనే వస్తున్నారన్నట్టుగా తెలుస్తుంది.