బాలయ్య డబుల్ యాక్షన్..మళ్లీ దుమ్ము దుమారమే!
నటసింహ బాలకృష్ణ పుల్ స్వింగ్ లో ఉన్నారు. సక్సెస్ లు మీద సక్సెస్ లు కొట్టకుని వెళ్లిపోతున్నారు.
By: Srikanth Kontham | 26 Aug 2025 8:15 AM ISTనటసింహ బాలకృష్ణ పుల్ స్వింగ్ లో ఉన్నారు. సక్సెస్ లు మీద సక్సెస్ లు కొట్టకుని వెళ్లిపోతున్నారు. ఎలాంటి కథనైనా హిట్ చేయడం బాలయ్య కే సొంతమన్న రేంజ్ లో విజయాలు చెంత చేరుతున్నాయి. బోయపాటితో డబుల్ హ్యట్రిక్ ప్లానింగ్ లో భాగంగానే `అఖండ 2` ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పాన్ ఇండియాలో ఏ రేంజ్ లో అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్ తో మెప్పించబోతున్నారు. బోయపాటి సినిమాల్లో బాలయ్య డబుల్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
రెండు పాత్రలను పోటా పోటీగా తీర్చిదిద్దడం ఆయన ప్రత్యేకత. దీంతో `అఖండ 2` లోనూ అదే స్థాయిలో ఉంటాయని అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ రిలీజ్ తేదీ ఎప్పుడొస్తుందా? అని నందమూరి అభి మానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే మరో యాక్షన్ మేకర్ గోపీచంద్ మలినేనితో కొత్త ప్రాజెక్ట్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్టోరీ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ షురూ అయింది. గోపీచంద్ స్క్రిప్ట్ సిద్దం చేసి లాక్ చేసి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదొక సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమట.
బాలయ్య మాస్ ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని యాక్షన్ పీక్స్ లో నే కథలో భాగం చేసారుట. మూల కథ చాలా కొత్తగా ఉంటుందని... దాన్ని బేస్ చేసుకునే అద్భుతమైన సన్నివేశాలు...యాక్షన్ సీన్స్ డిజైన్ చేయి స్తున్నాడుట. రెగ్యులర్ యాక్షన్ సన్నివేశాలకు భిన్నంగా ఈసారి కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారుట. `అఖండ 2` హిట్ తర్వాత బాలయ్య రేంజ్ ఆకాశన్నంటుతోంది. అవన్నీ దృష్టిలో పెట్టుకునే గోపీచంద్ మలినేని బాలయ్యని నెక్స్ట్ లెవల్ యాక్షన్ స్టార్ గా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
అలాగే సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలోనే కనిపిస్తారుట. దీనికి సంబంధించి గోపీచంద్ కొన్ని రోజుల క్రితమే ఎక్స్ వేదికగా ఓ హింట్ ఇచ్చారు. గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్. ఈసారి గర్జన మరింత గట్టిగా ఉంటుందని, సౌండింగ్ తో థియేటర్లు దద్దరిల్లిపోతాయని థమన్ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. తాజాగా స్టోరీ లైన్ తో రావడంతో బాలయ్య అభిమానులకు డబుల్ కిక్ లా మారింది. అదీ సింహం 111వ చిత్రం సంగతి.
