Begin typing your search above and press return to search.

బాలయ్య 'అఖండ 2'.. నైజాంలో ఏం జరుగుతోంది?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన అఖండ 2: తాండవం మూవీ ఇప్పుడు అన్ని సమస్యలను తొలగించుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   10 Dec 2025 4:09 PM IST
బాలయ్య అఖండ 2.. నైజాంలో ఏం జరుగుతోంది?
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన అఖండ 2: తాండవం మూవీ ఇప్పుడు అన్ని సమస్యలను తొలగించుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నిజానికి డిసెంబర్ 5వ తేదీన సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వాల్సి ఉండగా.. ముందు రోజు ప్రీమియర్స్ పడాల్సి కూడా ఉంది.

కానీ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోవడం వల్ల వాయిదా పడింది. మద్రాసు హైకోర్టు రిలీజ్ పై స్టే విధించడంతో విడుదలకు కొన్ని గంటల ముందు మేకర్స్ కు షాక్ తగిలింది. ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు పూర్తవడంతో కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

డిసెంబర్ 12వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. 11వ తేదీ రాత్రి ప్రీమియర్స్ పడనున్నాయి. అంటే మరికొన్ని గంటల్లో అఖండ-2 మూవీ సందడి చేయనుంది. కానీ నైజాంలో ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వలేదు. ప్రీమియర్స్ కు ఇంకా 24 గంటల సమయం మాత్రమే ఉన్నా.. అఖండ 2: తాండవం టికెట్లు అందుబాటులోకి రాలేదు.

అందుకు కారణం ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో మంజూరు కాకపోవడమే. గత వారం రిలీజ్ డేట్ కోసం అప్పుడు జీవో ఇచ్చినా.. ఇప్పుడు తేదీ మారడం వల్ల కొత్తగా జీవోను మేకర్స్ పొందాలి. అందుకు గాను ఇప్పటికే అప్లై చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు సర్కార్ నుంచి టికెట్ రేట్ల పెంపుతోపాటు ప్రీమియర్స్ కోసం జోవో జారీ అవ్వలేదు.

దీంతో మేకర్స్ ప్రస్తుతం వెయిటింగ్ మోడ్ లో ఉన్నారు. అయితే గత వారం కూడా ఆలస్యంగానే జీవో వచ్చింది. ప్రీమియర్స్ కు తక్కువ సమయం ముందే వచ్చింది. కానీ అంతలోనే సినిమా వాయిదా పడింది. ఇప్పుడు కూడా జీవో రావడం ఆలస్యం అవుతుంది. ఇంకా లేట్ అయితే బుకింగ్స్ పై కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

సినిమాపై ఆడియన్స్ లో బజ్ ఉన్నా కూడా.. బుకింగ్స్ లేట్ అయితే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అదే సమయంలో ఏపీలో పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. కొత్త రిలీజ్ తేదీ ప్రకటన వచ్చిన కాసేపటికే జీవో వచ్చేసింది. దీంతో మేకర్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం అక్కడ ఫుల్ జోష్ లో సేల్స్ జరుగుతున్నాయి. కానీ నైజాంలో ఇంకా ఉలుకు లేదు.. పలుకు లేదు.. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎప్పుడు ఇస్తుందో.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో వేచి చూడాలి.