ఎగతాళి అనేది అజ్ఞానానికి నిదర్శనం!
బుల్లితెర క్లాసిక్ సీరియల్ `క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ` ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. దీంతో మళ్లీ ఈ సీరియల్ పున ప్రసారం అవుతోంది.
By: Srikanth Kontham | 6 May 2026 12:00 AM ISTబుల్లితెర క్లాసిక్ సీరియల్ `క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ` ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. దీంతో మళ్లీ ఈ సీరియల్ పున ప్రసారం అవుతోంది. రీ-రిలీజ్ లోనూ బుల్లి తెర ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అలాగే సీరియల్ అంతే వివాదాస్పదంగానూ మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఇందులో నటించిన నటుడు ఆకాశదీప్ సైగల్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాత్రల మధ్య ఉన్న వయసు వ్యత్యాసంపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ఇంత వరకూ ఎలాంటి స్పందన లేకుండా మౌనంగా ఉన్నా? ఈ అంశంపై తాజాగా ఆకాశదీప్ స్పందించాడు.
వయసు వ్యత్యాసంపై అర్దం లేని ట్రోలింగ్ చేస్తున్నారని కొట్టిపారేసాడు. అలాంటి వాటిని తానెంత మాత్రం పట్టించుకోనన్నాడు. ఈ సీరియల్‌లో అన్షుమాన్ పాత్ర పోషించిన ఆకాశదీప్, స్మృతి ఇరానీ పోషించిన తులసి పాత్రకు కొడుకుగా కనిపిస్తారు. కానీ నిజ జీవితంలో ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం చాలా తక్కువ. దీన్నీ పట్టుకుని నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తుండటంతో ఆకాశ్ అసహనం వ్యక్తం చేశాడు. నటన అనేది ఓ కళ అని, అక్కడ పాత్రల డిమాండ్ ముఖ్యం తప్ప నిజ జీవిత వయసు కాదని స్పష్టం చేశాడు. వయసును ఆధారంగా చేసుకుని నటీనటులను ఎగతాళి చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని పేర్కొన్నాడు.
నటుడిగా తన బాధ్యత ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడమేనన్నాడు. ఏక్తా కపూర్ వంటి గొప్ప నిర్మాత విజన్‌ను అర్థం చేసుకోకుండా చిన్న విషయాలను పట్టుకుని విమర్శలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నాడు. `మేము ఒక కథను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ కథలో పాత్రల మధ్య సంబంధం ఏంటనేది ముఖ్యం. అంతే తప్ప వెండితెర వెనుక మా వయసు ఎంత? అనేది ప్రేక్షకులకు అనవసరం` అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను కేవలం ఓ శబ్దం మాత్రమేనన్నాడు.
ఇలాంటి నెగటివిటీని తాను ఏమాత్రం పట్టించుకోనని, అది తన పనిపై ఎలాంటి ప్రభావం చూపించదని ధీమా వ్యక్తం చేశాడు. ఒక నటుడిగా తనకు దక్కిన గుర్తింపు, అభిమానుల ప్రేమే ముఖ్యమని ట్రోలింగ్ చేసే వారు కేవలం అటెన్షన్ కోసమే చేస్తారని విమర్శించాడు. ప్రతిభను కాకుండా ఇతరుల వ్యక్తిగత విషయాలపై ఫోకస్ చేసే సంస్కృతి మారాలని కోరుకుంటున్నానన్నాడు. ఏక్తా కపూర్ రూపొందించిన ఈ సీరియల్ భారతీయ బుల్లితెర చరిత్రలోనే ఒక విప్లవం అని కొనియాడారు.
ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ సీరియల్ గురించి ప్రజలు మాట్లాడు కుంటున్నారంటే అది దాని గొప్పతనమేనని అన్నారు. నటీనటుల మధ్య ఉండాల్సిన కెమిస్ట్రీ, ఆ పాత్రల ఎమోషన్స్ సరిగ్గా పండినప్పుడు వయసు వ్యత్యాసాలు ఎక్కడా అడ్డు రావని వివరించారు. కళను కళగా చూడాలే తప్ప, కొలమానాలతో కొలవకూడదని హితవు పలికాడే. `క్యుంకీ` వంటి సీరియల్స్ పట్ల ఉన్న గౌరవాన్ని ఇలాంటి ట్రోల్స్ తగ్గించలేవని, ప్రేక్షకులకు నాణ్యమైన వినోదాన్ని అందించడమే ప్రథమ ప్రాధాన్యత అని గట్టిగానే చెప్పాడు.
