Begin typing your search above and press return to search.

విడాకుల గోల న‌డుమ న‌టి ప్ర‌వ‌ర్త‌న‌పై పెద్ద చ‌ర్చ‌

కొన్నిసార్లు వేదిక‌ల‌పై న‌టీమ‌ణులు అదుపు త‌ప్పి బోల్డ్ గా మేల్ కోస్టార్స్ తో స‌న్నిహిత చుంబ‌నాల‌తో చెల‌రేగుతారు.

By:  Sivaji Kontham   |   8 Feb 2026 8:00 AM IST
విడాకుల గోల న‌డుమ న‌టి ప్ర‌వ‌ర్త‌న‌పై పెద్ద చ‌ర్చ‌
X

కొన్నిసార్లు వేదిక‌ల‌పై న‌టీమ‌ణులు అదుపు త‌ప్పి బోల్డ్ గా మేల్ కోస్టార్స్ తో స‌న్నిహిత చుంబ‌నాల‌తో చెల‌రేగుతారు. అలాంటి స‌మ‌యంలో వారి మ‌న‌సులో ఏం ఉందో ఎవ‌రూ గ్ర‌హించ‌లేరు. అస‌లేం జ‌రిగిందో అర్థం కాదు. అది చాలా టూమ‌చ్ గా ఉంద‌ని, ప‌బ్లిక్ లో ఇలా ఒక న‌టి లేదా న‌టుడు రొమాన్స్ చేయ‌వ‌చ్చా? అని కూడా ప్ర‌శ్నిస్తుంటారు.

అక‌స్మాత్తుగా అదుపు త‌ప్పి, భావోద్వేగానికి గురై వేదిక‌ల‌పై క‌థానాయిక‌ల బుగ్గ‌పై ఘాడంగా చుంబించే డైరెక్ట‌ర్లు లేదా సినిమాటోగ్రాఫ‌ర్ల‌ను గ‌తంలో చూసాం. కాజ‌ల్ అగ‌ర్వాల్ ని సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కే నాయుడు వేదిక‌పైనే ముద్దాడేసారు. అది త‌మ మ‌ధ్య చాలా కాలంగా ఉన్న సాన్నిహిత్యం నుంచి పుట్టుకొచ్చిన‌ అనురాగం అంటూ ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చినా విమ‌ర్శ‌కులు వ‌దిలిపెట్ట‌లేదు. ఆ త‌ర్వాత‌ ద‌ర్శ‌కుడు ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి కూడా యంగ్ బ్యూటీ మ‌న్నారా చోప్రాను బ‌హిరంగంగా వేదిక‌పై ముద్దాడేసి పెద్ద చ‌ర్చ‌కు తావిచ్చారు. ఇటీవ‌ల పాప్ గాయ‌కుడు ఏపీ థిల్లాన్ హిందీ న‌టి తారా సుతారియాను ముద్దాడిన వీడియో కూడా వైర‌ల్ అయింది.

ఇంత‌లోనే ఇప్పుడు బిగ్ బాస్ 19 (BB19) విజేత గౌరవ్ ఖన్నా భార్య, నటి ఆకాంక్ష చమోలా ప్రస్తుతం ఒక వివాదాస్పద డ్యాన్స్ వీడియో కారణంగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వీడియోలో త‌న‌ను స‌హ‌చ‌ర న‌టుడు చుంబిస్తున్న‌ట్టు క‌నిపించిన క్లిప్ వైర‌ల్ గా మారుతోంది. నిజానికి ఇది ఒక ప్ర‌మోష‌న‌ల్ స్టంట్. ఆకాంక్ష చమోలా తన త‌దుప‌రి ప్రాజెక్ట్ `దిల్ ధోఖా ఔర్ డిజైర్` ప్రమోషన్స్‌లో భాగంగా సహనటులు కున్వర్ అమర్, అలీ హసన్‌లతో కలిసి ఒక స్కిట్ చేసారు. ఈ స్కిట్ లో ఒక అమ్మాయితో ఇద్ద‌రు రొమాన్స్ చేయాలి. అయితే ఇది చూడ‌టానికి వేదిక‌పై చాలా వ‌ల్గ‌ర్ గా అనిపించింద‌ని నెటిజ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అస‌లు ప‌బ్లిక్ లో ఇంత డీగ్రేడ్ యాక్ట్ కి పాల్ప‌డ‌తారా? అంటూ కొంద‌రు ప్ర‌శ్నించారు. ఒక‌రు ఆమెను వెన‌క నుంచి కౌగిలించుకోవ‌డం..ఒక‌రు చేతిని గుంజుకుని ముద్దాడ‌బోవ‌డం.. ఈ వీడియో చూస్తుంటే చాలా నీచంగా ఉంద‌ని నెటిజ‌నులు కామెంట్లు చేసారు. ఒక పెళ్ల‌యిన న‌టి ఇలా చేస్తుందా? పైగా భ‌ర్త నుంచి విడాకులు తీసుకోబోతోందంటూ ప్ర‌చారం సాగుతున్న స‌మ‌యంలో ఇలా చేస్తుందా? అంటూ చాలా చ‌ర్చ వేడెక్కించింది. ఇది చీప్ గా వ‌ల్గ‌ర్ గా ఉంద‌ని కొంద‌రు నెటిజ‌నులు మండిప‌డ్డారు. ఏపీ థిల్లాన్- తారా సుతారియా స్టేజీ స్టింట్ ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇది తార సుతారియా వీడియో కంటే ఘోరంగా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే త‌న‌పై ఘాటైన విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో ఆకాంక్ష చమోలా దీనిపై వివరణ ఇచ్చారు. ఇది ఒక‌రి క‌న్సెంట్(అనుమ‌తి)తో సౌక‌ర్యంగా చేసినది మాత్ర‌మే. ఇలాంటివి ఎంతో బాధ్య‌త‌తో చిత్రీక‌రిస్తారు. కావాల‌ని ఏదీ చేయ‌డం ఉండ‌ద‌ని అన్నారు. ఇలాంటి సీన్స్ తెర‌కెక్కించే ముందు వ‌ర్క్ షాప్స్ కూడా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

ఘాటైన‌ సన్నివేశాలు కేర్, కన్సెంట్, బాధ్యతతో చిత్రీకరిస్తారని, తన సహనటులు తనను చాలా కంఫర్ట్‌గా ఉంచారని ఆకాంక్ష‌ పేర్కొన్నారు. తాను పాజిటివ్ మైండ్‌సెట్‌తో ముందుకు వెళ్తానని, నెగటివ్ కామెంట్స్ తనను ప్రభావితం చేయవని స్పష్టం చేశారు. ఆకాంక్ష త‌న భ‌ర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నార‌ని.. వారి మ‌ధ్య విభేధాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే వీట‌న్నిటినీ ఆకాంక్ష కొట్టి పారేసారు.

ఆకాంక్ష వివ‌ర‌ణ‌ను ప‌రిగ‌ణిస్తే, వేదిక‌ల‌పై బ‌హిరంగంగా జరిగే ఇలాంటి స్టింట్స్ కేవ‌లం ఆవేశంలో జ‌రిగే త‌ప్పిదాలుగా కొంద‌రు చూస్తుంటే, అనుమ‌తి లేకుండా అక‌స్మాత్తుగా చేసేవి త‌ప్పిదాలేన‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. న‌టీమ‌ణిని అసౌక‌ర్యానికి గురి చేసే, డీగ్రేడ్ చేసే ప్ర‌తిదీ త‌ప్పిద‌మేనని కూడా విశ్లేషిస్తున్నారు. అవ‌న్నీ కేవ‌లం ఆవేశంలో అప్ప‌టిక‌ప్పుడు జ‌రిగే త‌ప్పులు అనుకోలేము.. వాటిని సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉందని ఒక సెక్ష‌న్ విశ్లేషిస్తోంది.