Begin typing your search above and press return to search.

ఊహించని రోజు రాబోతున్న ఆదర్శ కుటుంబం.. వర్కౌట్ అయ్యేనా?

ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అక్టోబర్ 2వ తేదీన ప్రతి ఒక్కరి ఆదర్శ కుటుంబం తలుపులు తెరుచుకోబోతున్నాయి అంటూ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అంచనాలు పెంచేశారు.

By:  Madhu Reddy   |   28 Jun 2026 12:42 AM IST
ఊహించని రోజు రాబోతున్న ఆదర్శ కుటుంబం.. వర్కౌట్ అయ్యేనా?
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వెంకటేష్ ఈ వయసులో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా తన సినిమాలతో ఆడియన్స్ను అలరించడమే కాకుండా భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ యంగ్ హీరోలను ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా నేటితరం హీరోలకి పోటీ ఇస్తూ ఫ్యామిలీ జోనర్ ను ఎంచుకొని అటు ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరైన వెంకటేష్ మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా ప్రకటించిన రోజు నుంచే అంచనాలు పీక్స్ కి చేరిపోయాయి. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సినిమాపై క్యూరియాసిటీనీ పెంచేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేస్తూ వెంకటేష్ పోస్ట్ పంచుకున్నారు. ఈ మేరకు విక్టరీ వెంకటేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా ఆదర్శ కుటుంబం సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అక్టోబర్ 2వ తేదీన ప్రతి ఒక్కరి ఆదర్శ కుటుంబం తలుపులు తెరుచుకోబోతున్నాయి అంటూ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అంచనాలు పెంచేశారు.

ఇకపోతే రిలీజ్ డేట్ ప్రకటించారు.. మరి ఆ రిలీజ్ డేట్ సమయం సరైనదేనా అనే కామెంట్లు అభిమానుల నుండి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి ..ఆరోజు మాత్రమే సెలవు. కానీ అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు దేవీ శరన్నవరాత్రుల సమయం.. ఆ సమయంలో మొత్తం హాలిడేస్ ఉంటాయి. ప్రేక్షకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను చూడడానికి వీలుంటుంది. అలాంటిది ఈ సమయాన్ని ఉపయోగించుకోకుండా అక్టోబర్ 2న మాత్రమే రిలీజ్ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..అందుకే నిర్మాతలు విడుదల తేదీ పై పునరాలోచన చేయాలి అని కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి అభిమానుల అభిప్రాయాలను నిర్మాతలు దృష్టిలో పెట్టుకుంటారా ? లేక అదే రోజు విడుదల చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

త్రివిక్రమ్ - వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబం ఏకే 47 సినిమా విషయానికొస్తే.. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా స్టోరీ పై కాపీ ఆరోపణలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. వాస్తవానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాలీవుడ్ చిత్రాలను కాపీ కొడతారనే ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇక ఆయన రూపొందించిన ఎన్నో సినిమాలకు ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఇక ఇప్పుడు ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 మూవీకి కూడా అదే రూమర్స్ వస్తున్నాయి.

ఈ సినిమా ఇటీవల వచ్చిన అర్జున్ సర్జ బ్లాస్ట్ మూవీ కథతో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో హీరో తమ కుటుంబానికి ఆపద వస్తే ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం చేసే పోరాటమే ఈ సినిమా.. ఇప్పుడు వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా కూడా సేమ్ కథట. వెంకటేష్ ఒక రా ఏజెంట్.. ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, కానీ అవన్నీ వదిలేసి ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడని.. అనుకోకుండా తన కుటుంబానికి ఆపద వస్తుందని.. మళ్లీ తాను గతంలోకి వెళ్లి కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే కథతో ఈ సినిమా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇటీవల బ్లాస్ట్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సేమ్ కథతో రాబోతున్న ఈ ఆదర్శ కుటుంబాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా ? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.