Begin typing your search above and press return to search.

ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన 'రంగం' ఫేం అజ్మ‌ల్

రంగం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన న‌టుడు అజ్మ‌ల్ అమీర్. ఆ చిత్రంలో జీవాతో పోటీప‌డి న‌టించి మెప్పించాడు.

By:  Sivaji Kontham   |   21 Oct 2025 9:47 AM IST
ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన రంగం ఫేం అజ్మ‌ల్
X

రంగం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన న‌టుడు అజ్మ‌ల్ అమీర్. ఆ చిత్రంలో జీవాతో పోటీప‌డి న‌టించి మెప్పించాడు. మ‌ల‌యాళం, త‌మిళం, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు అత‌డు సుప‌రిచితుడు. అయితే అత‌డిపై లైంగిక దుష్ప్ర‌వ‌ర్త‌న ఆరోప‌ణ‌లు రావ‌డం అభిమానుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది.

అత‌డు త‌ప్పుడుగా వ్యాఖ్యానించాడంటూ కొన్ని ఆడియో క్లిప్‌లు, స్క్రీన్‌షాట్‌లను ఆన్‌లైన్ లో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. తాజాగా దీనిపై అజ్మల్ అమీర్ స్పందించారు. ఇవ‌న్నీ నిరాధార ఆరోప‌ణ‌లు అని ఖండించారు. కంటెంట్ కృత్రిమ మేధ‌స్సును ఉపయోగించి తారుమారు చేసార‌ని అన్నారు. ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు త‌న‌కు అండ‌గా నిలిచిన అభిమానులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

కల్పిత కథల్ని వ్యాపింప‌జేయ‌డానికి ఏఐ వాయిస్‌ను ఉప‌యోగించార‌ని, ఇలాంటి అద్భుతమైన ఎడిట్ చేసిన క్లిప్ లు నన్ను కానీ, నా కెరీర్‌ను కానీ నాశనం చేయలేవని అజ్మ‌ల్ అమీర్ అన్నారు. రెండు పెద్ద ప‌రిశ్ర‌మ‌ల్లో నిరూపించుకుని కెరీర్ ప‌రంగా ముందుకు సాగుతున్నాన‌ని అజ్మ‌ల్ వ్యాఖ్యానించారు. ఏఐలో సృష్టించిన వీడియోల‌ను ఒక‌టికి రెండుసార్లు చూసి ఎడిట‌ర్ ని అడ‌గండి.. ఆయ‌న మీ సందేహాన్ని క్లియ‌ర్ చేస్తార‌ని కూడా అజ్మ‌ల్ అమీర్ అన్నారు.

త‌న‌కు ప్ర‌త్యేకించి పీఆర్ ఎవ‌రూ లేర‌ని, వ‌దంత‌లు పుట్టిన‌ప్పుడు ఖండించే టీమ్ లేద‌ని కూడా అత‌డు స్ప‌ష్ఠం చేసాడు. ఇంత‌కుముందు ఎప్పుడూ నేను ఆన్ లైన్ లో వ్య‌వ‌హారాల‌ను మేనేజ్ చేయ‌లేద‌ని కూడా అజ్మ‌ల్ అమీర్ అన్నారు. నా అభిమానులు ఒకప్పుడు సృష్టించిన సోషల్ మీడియా ప్రొఫైల్ చాలా కాలంగా అందుబాటులో ఉంది. ఇక‌పై దానిని నేను వ్యక్తిగతంగా నిర్వహిస్తాను! అని అన్నారు. వివాదం మొద‌లైన‌ప్పుడు త‌న‌కు మ‌ద్ధ‌తునిచ్చిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌స్తుతం దుబాయ్ లో ఓ షూటింగ్ లో బిజీగా ఉన్నాన‌ని కూడా తెలిపారు.

అజ్మల్ అమీర్ తెలుగు, త‌మిళంలో స్టార్ గా ఎదిగారు. 2024లో దళపతి విజయ్ నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' ( ది గోట్) చిత్రంలో న‌టించారు. ఫిబ్రవరి 14 (2005) అనే తమిళ చిత్రంలో విల‌న్ గా ఆరంగేట్రం చేసిన అజ్మ‌ల్, ఆ త‌ర్వాత మిష్కిన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం `అంజతే` మంచి పేరును తెచ్చింది. మోహన్ లాల్ తో కలిసి మాదంబి అనే చిత్రంలో నటించాడు. అజ్మ‌ల్ న‌టించిన రంగం (కో త‌మిళం) 2011లో విడుద‌లైంది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. ఇందులో అజ్మ‌ల్ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. రామ్ చ‌ర‌ణ్‌- రచ్చ, బ్యాంగిల్స్ , నెట్రికన్ చిత్రాల‌లోను న‌టించాడు. తెలుగు థ్రిల్లర్ మూవీ- మంగళవారమ్ (2023) లలో తన నటనకు అజ్మల్ రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.