నష్టాలను అలా భర్తీ చేస్తున్నా హీరో మాత్రం తగ్గలే!
ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద అసలైన వసూళ్ల లెక్క అంత అన్నది ఎప్పటికీ మిస్టరీలాగే ఉంటుందేమో.
By: Srikanth Kontham | 18 Sept 2025 12:09 PM ISTఎంత పెద్ద స్టార్ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద అసలైన వసూళ్ల లెక్క అంత అన్నది ఎప్పటికీ మిస్టరీలాగే ఉంటుందేమో. పోస్టర్లలో వేసినంత ఫిగర్ అక్కడికే పరిమితమని...థియేట్రికల్ గా అంత ఉండదని పలువురు నిర్మాతలు అంటుంటారు. అదంతా కేవలం ప్రచారం వరకే పరిమితమంటారు. ఆ మధ్య ఓ తెలుగు బడా ప్రొడ్యూసర్ నోట కూడా ఇదే మాట వచ్చింది. ఆ లెక్క వేరు..మా లెక్క వేరు. అసలు లెక్క ఎంత? అన్నది మాత్రం ఏ నిర్మాత బయటకు చెప్పరని ఓపెన్ అయ్యారు. అప్పటి నుంచి పోస్టర్లలో వేసే నెంబర్లు ఏవీ నిజం కాదని ఓ ఐడియా ఏర్పడింది.
అదంతా ప్రచారం కోసం చేసే డాబు తప్ప! దాని వెనుక ఎన్నో కారణాలుంటాయని అర్దమైంది. తాజాగా కోలీవుడ్ స్టార్ తల అజిత్ విషయంలో కూడా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. అజిత్ గత సినిమా `గుడ్ బ్యాడ్ అగ్లీ` బాగానే ఆడింది. థియేట్రికల్ గా మంచి వసూళ్లు రావడంతో నిర్మాతలు సహా అంతా మంచి లాభాలు చూసినట్లు అంతా భావించారు. కానీ అసలు లెక్క ఇదని తెరపైకి వస్తోంది. `గుడ్ బ్యాడ్ అగ్లీ` బడ్జెట్ 200కోట్లుపైనే. వరల్డ్ వైడ్ థియేట్రికల్ గా 240 కోట్లకు పైగా రాబట్టినట్లు వికీ సమాచారంతో తెలుస్తోంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ లెక్క 153 కోట్లు అని వెలుగులోకి వచ్చింది. దీంతో థియేట్రికల్ గా ఈ సినిమా నష్టాలే మిగిల్చింది.
కానీ ఓటీటీ మార్కెట్ కారణంగా సేఫ్ అయ్యారు. ఈసినిమా రైట్స్ ను 90 కోట్లకు పైగా కొన్నారు. ఆ కారణంగానే నిర్మాత థియేట్రి కల్ గా వచ్చిన నష్టాలను భర్తీ చేసినట్లు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కంటే ముందు అజిత్ నటించిన మరో చిత్రం `విదాముయార్చీ` కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 185 కోట్లు. కానీ థియిట్రికల్ గా 134 కోట్లు రాబట్టింది. కానీ ఓ టీటీలో బిగ్ డీల్ జరిగింది. నెట్ ప్లిక్స్ ఈ చిత్రాన్ని ఏకంగా 100 కోట్లకు కొంది.
అలా వచ్చిన నష్టాలు ఓటీటీ డీల్ తో బ్యాలెన్స్ చేసారు. ఇలా రెండు సినిమాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ సినిమాలకు అజిత్ కూడా భారీగానే పారితోషికం అందుకున్నట్లు తాజాగా వెలుగులోకి వస్తోంది. విదాముయార్చీ 100 కోట్లు తీసుకున్నాడని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకె 64 చిత్రానికి కూడా భారీగా పారితోషికం పెంచి ఛార్జ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లకు పైగానే ఉంటుందని... ఈ నేపథ్యంలో మార్కెట్ సహా బడ్జెట్ ఆధారంగానూ హైక్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో వాస్తవం తెలియాల్సి ఉంది.
