Begin typing your search above and press return to search.

తండ్రి బాట‌లోనే త‌న‌యుడు!

త‌ల అజిత్ కు కారు రేసింగ్ అంటే ఎంత ఇష్ట‌మో చెప్పాల్సిన ప‌నిలేదు. తానే ఓ గొప్ప రేస‌ర్. సొంత‌గా ఓటీమ్ కూడా ఉంది.

By:  Srikanth Kontham   |   29 Sept 2025 6:03 PM IST
తండ్రి బాట‌లోనే త‌న‌యుడు!
X

త‌ల అజిత్ కు కారు రేసింగ్ అంటే ఎంత ఇష్ట‌మో చెప్పాల్సిన ప‌నిలేదు. తానే ఓ గొప్ప రేస‌ర్. సొంత‌గా ఓటీమ్ కూడా ఉంది. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై రయ్ ర‌య్ మంటూ దూసుకుపోవడం తెలిసిందే. ఇటీవ‌లే జ‌రిగిన దుబాయ్ పోటీల‌ల్లోనూ అజిత్ టీమ్ నెగ్గింది. వ‌య‌సు మీద ప‌డుతున్నా? ప్ర‌మాదం పొంచి ఉన్నా కార్ రేసింగ్ నుంచి త‌ప్పించుకోవ‌డం మాత్రం త‌న వ‌ల్ల కావ‌డం లేదు. ఆ మ‌ధ్య రేసింగ్ ప్రాక్టీస్ లో పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో రేసింగ్ నుంచి నిష్క్ర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కానీ రేసింగ్ ను వ‌ద‌ల్లేక మ‌ళ్లీ కొన‌సాగుతున్న‌ట్లు నిష్క్ర‌మ‌ణ‌ను వెన‌క్కి తీసుకున్నారు. అలా మ‌ళ్లీ సినిమాల‌తో పాటు రేసింగ్ ను కొన సాగిస్తున్నారు. మ‌రి అజిత్ వార‌సుడిని రేస‌ర్ ని చేయ‌బోతున్నారా? సినిమా హీరోని చేయ‌బో తున్నారా? అంటే అది వాళ్లిష్టం అంటూ కుమారుడి నిర్ణ‌యానికే వ‌దిలేసారు. కుమారుడు అద్విక్ కూడా త‌క్కువేం కాదు. క్రీడ‌ల్లో తండ్రిని మించిన త‌న‌యుడిగా నిరూపిస్తున్నాడు. ఆద్విక్‌కు తండ్రిలాగే ఆట‌లపై చాలా ఆసక్తి ఉంది. పాఠశాల క్రీడా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.

ఆద్విక్ ఇటీవల ఇంటర్- స్కూల్ అథ్లెటిక్ పోటీలలో పాల్గొన్నాడు. స్ప్రింట్, రిలే రేసులలో మొదటి స్థానాన్ని పొందాడు. ఆద్విక్ భవిష్యత్తులో భారతదేశానికి కీర్తిని తెస్తాడని డాడ్ అండ్ మామ్ ఆశలను వ్యక్తం చేశారు. ఇప్ప‌టికే గో-కార్టింగ్ ప్రారంభించాడని తెలిపారు. కానీ కార్ రేసింగ్ కొన‌సాగిస్తాడా? లేదా? అన్న‌ది కుమారుడి నిర్ణ‌యానికే వ‌దిలేసారు. ఏ విష‌యంలోనూ పిల్ల‌ల‌పై ఒత్తిడి తీసుకురాన‌న‌ని..వారికి న‌చ్చిన రంగాల్లో రాణించే స్వేచ్ఛ ఇస్తున్న‌ట్లు తెలిపారు. టాలీవుడ్ న‌టుడు నాగ‌చైత‌న్య కి కూడా రేసింగ్ అంటే పిచ్చి అని తెలిసిందే.

త‌న‌కు గ‌నుక కుమారుడు పుడితే క‌చ్చితంగా మంచి రేస‌ర్ ని త‌యారు చేస్తాన‌న్నాడు. తాను ఎలాగూ ఆరంగంలో రాణించ‌లేద‌ని కుమారుడి రూపంలోనైనా త‌న కోర్కెను తీర్చుకోవాల‌ని ఉంద‌ని ఆ మ‌ధ్య వెల్ల‌డించారు. ఇది త‌న‌కు సంబంధించి స్వార్దమే అయినా ఈ విష‌యంలో మాత్రం కుమారుడిపై చిన్న ఒత్తిడి తీసుకొస్తాన‌ని న‌వ్వేసారు.

త‌ల్లిదండ్రులు సాధించ‌లేనిది పిల్ల‌ల రూపంలో త‌మ‌కు ఇష్ట‌మైతే సాధించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌డంలో త‌ప్పేముంది.