AK64 తళా పారితోషికం లేకుండానే
ఇటీవల తళా అజిత్ పూర్తిగా కార్ రేస్ లపై దృష్టి సారిస్తున్నాడు. దీనికోసం నెలల తరబడి సమయం కేటాయించాడు.
By: Sivaji Kontham | 31 July 2025 11:28 AM ISTఇటీవల తళా అజిత్ పూర్తిగా కార్ రేస్ లపై దృష్టి సారిస్తున్నాడు. దీనికోసం నెలల తరబడి సమయం కేటాయించాడు. రెగ్యులర్ గా రేస్ కోర్ట్ లో ప్రాక్టీస్ చేస్తూ తళా ఆటాడేస్తున్నాడు. అతడిని గెలుపు గుర్రం వరిస్తోంది కూడా. అయితే రేసింగ్ లకు వెళ్లినంత మాత్రాన సినిమాలను వదిలేసాడని అనుకోకూడదు. అతడు రెండు పడవల ప్రయాణాన్ని సాఫీగానే నడిపిస్తున్నాడు. అప్పుడప్పుడు ఫ్లాపులు వచ్చినా ఒక్క పెద్ద హిట్టుతో తిరిగి కంబ్యాక్ అవుతున్నాడు.
అతడు నటించిన `విదాముయార్చి` ఫ్లాపైనా కానీ, ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` ఘనవిజయం సాధించింది. ఈ సినిమా అజిత్ కి గ్రేట్ కంబ్యాక్ ని ఇచ్చింది. ఇందులో త్రిష కూడా ఒక కథానాయిక. మాస్ యాక్షన్ చిత్రం `గుడ్ బ్యాడ్ అగ్లీ` తరవాత అజిత్ ఏ సినిమాలో నటిస్తారు? అనేదానిపై ఇప్పటికి క్లారిటీ వచ్చింది. అతడు AK64 కోసం ప్రస్తుతం పని చేస్తున్నాడు. తాజాగా అందిన సమాచారం మేరకు.. తళా అజిత్ ఈ సినిమాకి పారితోషికం అందుకోవడం లేదు.
ఫార్ములా ఎందుకు మార్చారు?
అలాగని స్టార్ హీరో ఫ్రీగా పని చేయడం లేదు. తళాకు పారితోషికం కాకుండా, `ఏకే 47` ఓటీటీ, డిజిటల్ రైట్స్‌ని అప్పజెబుతున్నారని సమాచారం. తద్వారా వచ్చే డబ్బు మాత్రమే తళా అకౌంట్లోకి వెళుతుంది. థియేట్రికల్ రైట్స్ సహా ఇతర మార్గాల్లో నిర్మాత తన పెట్టుబడుల్ని తిరిగి పొందుతారు. అయితే అజిత్ ఈ కొత్త మోడల్ లో ఎందుకు పని చేయాలనుకున్నారు? అంటే...! పలువురు నిర్మాతలు అజిత్ పారితోషికంగా 200 కోట్లు డిమాండ్ చేయడం వల్లనే చేతులెత్తేసారని, ఇప్పుడు నిర్మాత మార్పుతో ముందుకెళుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
200 కోట్లు డిమాండ్ చేసారా?
గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఏకే 47 కి కూడా దర్శకత్వం వహిస్తుండగా, తొలుత వెల్స్ ఫిల్మ్స్ అజిత్ చిత్రాన్ని నిర్మిస్తుందని భావించారు. కానీ ఇప్పుడు రోమియో పిక్చర్స్ రాహుల్ నిర్మిస్తారని దాదాపుగా ఖరారైనట్టు కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అజిత్ 200 కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేయడంతో వెల్స్ ఫిల్మ్స్ వెనకడుగు వేసింది. అయితే నిర్మాత రాహుల్ 200 కోట్లు చెల్లించరు కానీ, ఓటీటీ డీల్ ద్వారా అలాగే డిజిటల్ హక్కుల ద్వారా వచ్చిన మొత్తాన్ని అజిత్ కి అందిస్తారు. రాహుల్ కేవలం థియుట్రికల్ గా వచ్చిన దానికే పరిమితం అవుతారని తెలిసింది. ఒక ప్రత్యేక ఫార్ములాలో అజిత్ పారితోషికం అన్నదే లేకుండా నటించడం ఇదే మొదటిసారి. AK64 చిత్రీకరణ నవంబర్‌లో ప్రారంభం కానుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతుందని సమాచారం. కేజీఎఫ్ కథానాయిక శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించనుండగా, జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తారని తెలుస్తోంది.
