Begin typing your search above and press return to search.

15 రోజులు అలా..మ‌రో 15 రోజులు ఇలా!

కానీ త‌ల అజిత్ మాత్రం షూటింగ్ లు ఎలా ఉన్నా ఫ్యామిలీ కి మాత్రం ప‌క్కాగా 15 రోజులు స‌మ‌యం ఇస్తాడుట‌. కంటున్యూగా 15 రోజులు షూటింగ్ చేసి మిగిలిన 15 రోజులు ఇంట్లో ఫ్యామిలీతోనే ఉంటాడు.

By:  Srikanth Kontham   |   25 Nov 2025 6:00 AM IST
15 రోజులు అలా..మ‌రో 15 రోజులు ఇలా!
X

స్టార్ హీరోలంతా నిత్యం షూటింగ్ ల‌తో ఎంతో బిజీగా ఉంటారు. దీంతో కుటుంబానికి కేటాయించే స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఇన్ డోర్ షూటింగ్ అయితే? ఉద‌యం వెళ్లి సాయంత్రానికి ఇంటికొచ్చేస్తారు. ఆ త‌ర్వాత ఫ్యామిలీ కి కొంత స‌మ‌యం కేటాయించే అవ‌కాశం ఉంటుంది. మ‌హేష్ ఉద‌యం ఎన్నిగంట‌ల‌కు షూటింగ్ కి వెళ్లినా? సాయంత్రం ఆరు గంట‌ల‌కు ఇంట్లో ఉంటారు. ఆరు త‌ర్వాత ప‌ని చేయ‌డం మ‌హేష్‌కి సాద్యం కాదు. దీంతో ఆయ‌న టైమింగ్ ని బ‌ట్టి షూటింగ్ ప్లాన్ చేస్తుంటారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్నీ, ప్రభాస్ ఇలా దాదాపు స్టార్ హీర‌లోంతా వాళ్ల టైమింగ్ ని బ‌ట్టే షూటింగ్ ప్లానింగ్ ఉంటుంది.

టాలీవుడ్ కి భిన్నంగా బాలీవుడ్:

ఇదంతా లోక‌ల్ గా షూటింగ్ జ‌రిగితేనే. ఔట్ డోర్ విదేశాల‌కు షూటింగ్ కోసం వెళ్తే? చాలా సంద‌ర్భాల్లో టైమ్ లెస్ గా ప‌నిచేయాల్సి ఉంటుంది. వీలైనంత వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌క‌పోతే నిర్మాత‌కు బ‌డ్జెట్ పెరిగిపోతుంది. ఆ కార‌ణంగా త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేస్తుంటారు. కొన్ని సినిమా షూటింగ్ లు నెల‌ల త‌ర‌బ‌డి చేస్తుంటారు. ఏదీ ఏమైనా సినిమా హీరోలు మాత్రం కుటుంబానికి కావాల్సినంత స‌మ‌యాన్ని అయితే ఇవ్వ‌లేరు అన్న‌ది వాస్త‌వం. ఇక బాలీవుడ్ న‌టుల టైమింగ్ అయితే భిన్నంగా ఉంటుంది. కొంత మంది న‌టులు కేవ‌లం నైట్ మాత్ర‌మే ప‌ని చేసి డే అంతా పడుకుంటారు.

భార్యాభ‌ర్త‌లు మాట్లాడుకునేది 10 నిమిషాలే:

క‌రీనా క‌పూర్ భ‌ర్త సైఫ్ అలీఖాన్ ప‌ట్టుమ‌ని కూర్చుని ప‌ది నిమిషాలు కూడా మాట్టాడుకునే స‌మ‌యం ఉండ‌దు. నైట్ షూటింగ్ ల‌కు క‌రీనా వెళ్లిపోతే..వేకువ జామునే షూటింగ్ కి వెళ్లి సైఫ్ సాయంత్రం వ‌స్తాడు. ఇద్ద‌రు క‌లిసి మాట్లాడు కునేది తెల్ల‌వారు జామ‌న మాత్ర‌మే. అదీ ప‌ది నిమిషాలు. బాలీవుడ్ లో చాలా మంది న‌టుల టైమింగ్ ఇలాగే ఉంటుంది. కానీ త‌ల అజిత్ మాత్రం షూటింగ్ లు ఎలా ఉన్నా ఫ్యామిలీ కి మాత్రం ప‌క్కాగా 15 రోజులు స‌మ‌యం ఇస్తాడుట‌. కంటున్యూగా 15 రోజులు షూటింగ్ చేసి మిగిలిన 15 రోజులు ఇంట్లో ఫ్యామిలీతోనే ఉంటాడు.

నెలంతా అజిత్ ప్లానింగ్ ఇలాగే ఉంటుందిట‌. ఆ కార‌ణంగానే త‌న సినిమా షూటింగ్ లు కూడా ఆల‌స్య‌మ‌వుతాయ‌ని తెలుస్తోంది. అజిత్ ఒక సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ మ‌రో సినిమాకు క‌మిట్ అవ్వ‌డు. ఒకేసారి రెండు..మూడు సినిమా షూటింగ్ ల‌కు హాజ‌రుకాడు. అలా చేస్తే కుటుంబానికి స‌మ‌యం ఇవ్వ‌లేడు. మ‌ధ్య‌లో కార్ రేసింగ్ కాంపిటీష‌న్స్ కూడా హాజ‌ర‌వుతుంటాడు.