ఆ దుర్ఘటనకు విజయ్ ఒక్కడే బాధ్యుడే కాదు
ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ ఈ తొక్కిసలాట విషయంపై మాట్లాడారు. ఇలాంటి సిట్యుయేషన్స్ కు కారణాలు, ఎవరు ఎలా ప్రవర్తించాలనే వాటిపై ఆయన నోరు విప్పారు.
By: Sravani Lakshmi Srungarapu | 1 Nov 2025 3:38 PM ISTప్రముఖ కోలీవుడ్ హీరో, కొత్త రాజకీయ నాయకుడు విజయ్ తన పొలిటికల్ పార్టీ తమిళగ వెట్రి కళగం బహిరంగ సభ నిర్వహిస్తున్నప్పుడు కరూర్ వద్ద తొక్కిసలాట జరిగి అందులో పలువురు అభిమానులు, జనాలు ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. అయితే రియాక్ట్ అయిన వాళ్లంతా ఆల్మోస్ట్ రాజకీయ పరంగా కాస్తో కూస్తో టచ్ ఉన్న వాళ్లే.
రీసెంట్ టైమ్స్ లో దుర్ఘటనలు ఎక్కువయ్యాయి
రాజకీయాలకు టచ్ లేని వాళ్లు, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ దీనిపై రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ ఈ తొక్కిసలాట విషయంపై మాట్లాడారు. ఇలాంటి సిట్యుయేషన్స్ కు కారణాలు, ఎవరు ఎలా ప్రవర్తించాలనే వాటిపై ఆయన నోరు విప్పారు. కరూర్ తొక్కిసలాట విషయంలో ఎవరినీ తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, కానీ ఇలాంటి సంఘటనలు రీసెంట్ టైమ్స్ లో ఎక్కువయ్యాయని ఆయన అన్నారు.
ఇండస్ట్రీకి చెడ్డ పేరొస్తుంది
దీనికి విజయ్ తో పాటూ ప్రతీ ఒక్కరూ బాధ్యులేనని, ఇలాంటి వాటిపై జనాలకు ఎక్కువగా అవగాహన కల్పించాలని, సినీ సెలబ్రిటీల సభల్లోనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి విషాదాల వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరొస్తుందని అజిత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సెలబ్రిటీల కోసం జనాలు ఎగబడతారనేది అందరికీ తెలిసిన విషయమేనని, అందుకే తాను తన పిల్లల్ని డ్రాప్ చేయడానికి కూడా ఎప్పుడూ స్కూల్ దగ్గరకు వెళ్లనని ఆయన చెప్పారు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ, తాను ప్రతీ సినిమానీ మొదటి సినిమాలాగానే ఫీలవుతానని, తాను సక్సెస్‌ను పెద్దగా పట్టించుకోనని, ఫస్ట్ మూవీ కోసం తనను మేకర్స్ 100 రోజుల కాల్షీట్స్ అడిగారని, అప్పట్నుంచి తాను డేట్స్ ఇస్తూనే ఉన్నానని, తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ఫ్యాన్స్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని అజిత్ అన్నారు.
నెగిటివ్ వార్తలు చూసి షాకయ్యా
గతంలో తమిళనాడు ఎలక్షన్స్ లో తనపై వచ్చిన ఓ వార్త విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను, తన భార్యతో కలిసి ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కు వెళ్లానని, అక్కడికి వచ్చిన సెలబ్రిటీలందరినీ ఓ వ్యక్తి ఫోటోలు తీస్తున్నాడని, అక్కడ ఫోన్ లు వాడకూడదని బోర్డులు పెట్టినప్పటికీ, అక్కడి స్టాఫ్ ఎంత చెప్తున్నా వినకపోవడంతో, తానే ఆ ఫోన్ లాక్కొని అక్కడి స్టాఫ్ కు ఇచ్చానని, దాన్ని అందరూ తాను ఓ అభిమానిపై ఫైర్ అయ్యానని నెగిటివ్ గా రాశారని ఆ వార్తలు చూసి షాకయ్యానని అజిత్ క్లారిటీ ఇచ్చారు.
