Begin typing your search above and press return to search.

అరుదైన గౌరవం అందుకున్న అజిత్.. ఫోటోలు వైరల్!

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా అనే మ్యాగజైన్ నవంబర్ మ్యాగజైన్ లో అజిత్ కుమార్ కవర్ పేజీ పై కనిపించబోతున్నారు.

By:  Madhu Reddy   |   31 Oct 2025 8:00 PM IST
అరుదైన గౌరవం అందుకున్న అజిత్.. ఫోటోలు వైరల్!
X

తమిళ నటుడు అజిత్ కుమార్ కి కేవలం తమిళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.ఈయన కేవలం సినిమాల పరంగానే కాకుండా కార్ రేసింగ్ లో కూడా దేశానికి ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టారు. అయితే అలాంటి నటుడు అజిత్ కుమార్ కి తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే అజిత్ కుమార్ కి ఒక హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోటోకి ఫోజ్ ఇచ్చి ఆ గౌరవాన్ని అందుకున్నారు. టి హెచ్ ఆర్ ఇండియా కవర్ మ్యాగజైన్ కోసం అజిత్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది..




ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా అనే మ్యాగజైన్ నవంబర్ మ్యాగజైన్ లో అజిత్ కుమార్ కవర్ పేజీ పై కనిపించబోతున్నారు. అయితే ఈ కవర్ పేజీపై చాలా రేర్ గా సెలెబ్రిటీలు దర్శనం ఇస్తారు. అలాంటి అవకాశం ఇప్పుడు అజిత్ కుమార్ కి వచ్చినందుకు ఆయన అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.. ది హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ కవర్ ఫోటో, ఇంటర్వ్యూ కోసం అజిత్ కుమార్ పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.





ఇక ది హాలీవుడ్ రిపోర్టర్ నవంబర్ కి సంబంధించిన మ్యాగజైన్ లో అజిత్ కుమార్ స్పెషల్ ఇంటర్వ్యూ ఉండబోతోంది. ఈ మ్యాగజైన్ లో అజిత్ కుమార్ కి సంబంధించిన ఎన్నో తెలియని విషయాలు బయటపడబోతున్నట్టు తెలుస్తోంది. అలా అజిత్ కుమార్ ది హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ కవర్ పేజికి ఫోజులిచ్చి అరుదైన గౌరవం అందుకున్నారు.





ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది అజిత్ కుమార్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.. అజిత్ కుమార్ ఈ మధ్యనే స్పెయిన్ లో జరిగిన 24 అవర్స్ కార్ రేస్ లో పాల్గొని మూడో స్థానంలో నిలిచి ఇండియాకి మంచి పేరు తీసుకువచ్చారు.





అంతే కాకుండా ఈ ఏడాది చివర్లో మలేషియాలో జరిగే కార్ రేసింగ్ తో పాటు వచ్చే ఏడాది అబుదాబిలో జరిగే కార్ రేసింగ్ పోటీలో కూడా అజిత్ కుమార్ పాల్గొనబోతున్నారు.




రీసెంట్ గా అజిత్ కుమార్ తన ఫ్యామిలీతో కలిసి పాలక్కడ్ లోని భగవతి అమ్మాన్ అనే ఆలయాన్ని సందర్శించారు. ఆ టైంలో అజిత్ కుమార్ ఛాతి కుడి వైపున వేయించుకున్న టాటూ బయటపడడంతో ఇది ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఇక అజిత్ తన ఛాతిపై వేయించుకున్న టాటూ తన కులదైవం భగవతి అమ్మాన్ అని తెలుస్తోంది.





అంతేకాకుండా ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అజిత్ సందర్శించారు. అజిత్ కుమార్ చివరిగా విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించారు