Begin typing your search above and press return to search.

మలయాళ సూపర్ స్టార్ ప్లేస్‌లో కన్నడ సూపర్‌ స్టార్‌..!

తమిళ స్టార్‌ అజిత్‌ కుమార్‌ హీరోగా అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే

By:  Ramesh Palla   |   18 Sept 2026 3:00 PM IST
మలయాళ సూపర్ స్టార్ ప్లేస్‌లో కన్నడ సూపర్‌ స్టార్‌..!
X

తమిళ స్టార్‌ అజిత్‌ కుమార్‌ హీరోగా అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే వీరి కాంబోలో 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' సినిమా వచ్చింది. ఆ సినిమాకు తమిళ ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. అందుకే మరోసారి వీరి కాంబోలో మూవీకి రంగం సిద్ధం అయింది. అజిత్ కుమార్‌ సొంత బ్యానర్‌లో ఈ సినిమా రూపొందబోతుంది. అయితే సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక విషయమై చర్చ జరుగుతోంది. మొదట ఈ సినిమాను అనుకున్న సమయంలో ఎంపిక చేసిన నటీనటులు ఇప్పుడు ప్రారంభించే సమయంకు డేట్లు సర్దుబాటు కాకపోవడంతో తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అజిత్‌ రేసింగ్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ఆలస్యంగా మొదలు పెట్టాల్సి వచ్చిందని, దాంతో డేట్ల విషయంలో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

డేర్‌ డెవిల్‌ సినిమాతో అజిత్‌ కుమార్‌...

ముందుగా అనుకున్న ప్రకారం అజిత్‌ 'డేర్‌ డెవిల్‌' సినిమాలో ముఖ్య పాత్రకు గాను మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ను ఎంపిక చేశారు. ఆయన సైతం కథ విన్న తర్వాత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. కానీ సినిమాను అనుకున్న సమయంకు ప్రారంభించక పోవడంతో పాటు, మోహన్ లాల్‌ డేట్లను సద్వినియోగం చేసుకోక పోవడంతో గందరగోళం క్రియేట్‌ అయింది. నవంబర్‌ నుంచి సినిమాను ప్రారంభించాలని, అప్పుడు డేట్లు కావాలని దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ ఇటీవల మోహన్‌ లాల్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే నవంబర్‌ నుంచి మార్చి వరకు ఫుల్‌ బిజీగా ఉండటం వల్ల ఆ మధ్య కాలంలో మరే సినిమాకు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదని, కొత్తగా మరే సినిమాకు ఆ సమయంలో డేట్లు ఇవ్వలేను అని తేల్చి చెప్పాడట. దాంతో తప్పని పరిస్థితుల్లో మరో నటుడి కోసం దర్శకుడు వెతుకుతున్నాడని వార్తలు వస్తున్నాయి.

కన్నడ సూపర్‌ స్టార్‌ సుదీప్‌...

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 'డేర్‌ డెవిల్‌'లోని ఆ ముఖ్యమైన పాత్ర కోసం కన్నడ సూపర్‌ స్టార్‌ సుదీప్‌ను తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అలాంటి పాత్రలను సుదీప్‌ చేయడంతో పాటు మెప్పించడం వల్ల అధిక్ రవిచంద్రన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే వరుస సినిమాలతో పాటు బిగ్‌బాస్ సీజన్‌ ప్రారంభం అయిన కారణంగా సుదీప్‌ ఈ సినిమాకు ఓకే చెప్తాడా అనే అనుమానాలు ఉన్నాయి. అజిత్‌ కుమార్‌తో ఉన్న అనుబంధంతో కచ్చితంగా సుదీప్‌ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని, అంతే కాకుండా భారీ పారితోషికం ఆఫర్‌ చేయడం వల్ల కూడా సుదీప్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మరో వైపు హీరోయిన్‌ విషయంలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

శ్రీలీల హీరోయిన్‌గా...

అజిత్‌ 'డేర్ డెవిల్‌' సినిమాను ప్రకటించిన సమయంలో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారు. ఆమె కథ విన్న తర్వాత ఓకే చెప్పిందని కూడా ప్రచారం జరిగింది. కానీ షూటింగ్‌ ఆలస్యం కావడంతో శ్రీలీల సైతం మరో సినిమాకు డేట్లు ఇవ్వడంతో ఈ సినిమాకు డేట్లు కేటాయించే పరిస్థితి లేదని అంటున్నారు. సినిమా కోసం నవంబర్‌ నుంచి వరుసగా మూడు లేదా నాలుగు నెలల పాటు డేట్లు కావాలని శ్రీలీలను దర్శకుడు అడిగాడట. అందుకు శ్రీలీల నో చెప్పడంతో ఆమె స్థానంలోనూ మరో హీరోయిన్‌ ను ఎంపిక చేయడం కోసం యూనిట్‌ సభ్యులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ముంబై ముద్దుగుమ్మలతో చర్చలు జరిపారని, షూటింగ్‌ ప్రారంభం అయ్యే సమయానికి కచ్చితంగా హీరోయిన్‌ ఎంపిక జరుగుతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి అజిత్‌ 'డేర్‌ డెవిల్‌' మూవీ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.