Begin typing your search above and press return to search.

వామ్మోవ్! గంట‌కు 250కి.మీ.. త‌ళా అజిత్ కార్ స్పీడ్!

త‌ళా అజిత్ కుమార్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. డేర్ .. గ‌ట్స్.. అడ్వెంచ‌ర్ అనే ప‌దాల‌కు అత‌డు కేరాఫ్ అడ్రెస్.

By:  Sivaji Kontham   |   23 Aug 2025 3:57 PM IST
వామ్మోవ్! గంట‌కు 250కి.మీ.. త‌ళా అజిత్ కార్ స్పీడ్!
X

త‌ళా అజిత్ కుమార్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. డేర్ .. గ‌ట్స్.. అడ్వెంచ‌ర్ అనే ప‌దాల‌కు అత‌డు కేరాఫ్ అడ్రెస్. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత కోలీవుడ్ లో అలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న బిగ్గెస్ట్ స్టార్. ద‌ళ‌ప‌తి విజ‌య్ తో నువ్వా నేనా? అంటూ పోటీప‌డ‌గ‌ల స‌మ‌ర్థుడు. ద‌శాబ్ధాల పాటు త‌మిళ సినిమాని ఏల్తున్న ది గ్రేట్ అజిత్ కుమార్ వ్య‌క్తిత్వం గురించి, స్పీడ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. భార‌త‌దేశంలో స్పోర్ట్స్ మేన్ గా రాణిస్తూ సినిమా స్టార్ గా వెలుగొందుతున్న ఏకైక స్టార్ అత‌డు.

అత‌డి సింప్లిసిటీ.. ఒదిగి ఉండే స్వభావం రియ‌ల్ త‌ళాగా ప్ర‌జ‌ల్లో ఇమేజ్‌ని పెంచాయి. అభిమానుల విష‌యంలో త‌ళా ధృక్ప‌థం కూడా చాలా సార్ల మ‌న‌సులు గెలుచుకుంది. త‌న‌ను బిరుదుల (త‌ళా)తో పిల‌వొద్ద‌ని, సింపుల్ గా అజిత్ అని పిల‌వాల‌ని కూడా ఆయన ప్ర‌తిసారీ వేదిక‌ల‌పై ఫ్యాన్స్ ను కోరుతున్నారు. స్టార్ల కోసం అభిమానులు త్యాగాలు చేయ‌డం స‌రికాద‌ని కూడా పిలుపునిచ్చారు. అభిమానులు ఎప్పుడూ త‌మ కుటుంబాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని సూచించారు.

త‌ళా అజిత్ గ‌ట్స్ - సాహ‌సాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అత‌డు ఫార్ములా వ‌న్ రేస‌ర్ గా రేస్ ట్రాక్ పై దూసుకుపోతున్న తీరుకు ముక్కున వేలేసుకోవాల్సిందే. 54 వ‌య‌సులో ఆయ‌న 25-300 కి.మీట‌ర్ల వేగంగా రేస్ ట్రాక్ పై దూసుకుపోతున్నాడు. వ్య‌క్తిగ‌తంగా కార్ రేసింగ్ ని అమితంగా ఇష్ట‌ప‌డే అజిత్ ఎలాంటి సాహ‌సానికైనా సై అనేస్తున్నారు. ఇటీవ‌ల వ‌ర‌స‌గా ఫార్ములా వ‌న్ పోటీల‌లో త‌న టీమ్ ని గెలిపిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

అత‌డి సాహ‌సాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసాక‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు అజిత్ కి ఫాలోయింగ్ పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. వ‌య‌సుతో సంబంధం లేకుండా రేసింగులతో అత‌డు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ఓవైపు యాక్సిడెంట్లు భ‌య‌పెడుతున్నా త‌గ్గేదేలే అంటూ రేస్ కోర్ట్ లోకి అడుగు పెడుతున్నాడు. సాహ‌సాల‌ను అత‌డు విడిచిపెట్ట‌డం లేదు. ఇప్పుడు అత‌డు ఒక రోడ్ పై 250 కి.మీల వేగంగా కార్ న‌డుపుతూ మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకొచ్చాడు. త‌ళా వేగానికి అభిమానులు కంగారు ప‌డుతున్నారే కానీ అత‌డు భ‌య‌ప‌డేదే లేదు! అంటూ రోడ్ పై ర‌య్ మంటూ దూసుకుపోతున్నాడు. అయితే ఈ వ‌య‌సులో ఈ స్పీడేంటి గురూ?.. కాస్త‌యినా త‌గ్గాలి! అంటూ అభిమానులు అజిత్ కి సూచిస్తున్నారు. త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్రారంభించ‌నున్న బుల్లెట్టు రైలు వేగం కంటే ఈయ‌న స్పీడే ఎక్కువ‌! ఇదే స్పీడ్ అత‌డు న‌టించే సినిమాల విష‌యంలో చూపించాల‌ని, ఏడాదికి మూడు నాలుగు సినిమాలు కచ్ఛితంగా రిలీజ్ చేయాల‌ని వారు కోరుతున్నారు.