Begin typing your search above and press return to search.

గుడిలో ప్రత్యేక పూజలు చేయించిన అజిత్ - షాలిని.. కారణం?

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అజిత్ కుమార్ తన భార్య షాలినితో కలిసి నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By:  Madhu Reddy   |   10 Aug 2025 7:00 PM IST
గుడిలో ప్రత్యేక పూజలు చేయించిన అజిత్ - షాలిని.. కారణం?
X

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అజిత్ కుమార్ తన భార్య షాలినితో కలిసి నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సడన్ గా పూజలు జరిపించడం వెనక అసలు కారణాన్ని అభిమానులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న అజిత్ కుమార్.. ప్రస్తుతం రేసింగ్ పైనే ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. చివరిగా విదాముయార్చి , గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అటు సినిమాలకు దూరంగా ఇటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న అజిత్ తాజాగా తన భార్యతో కలిసి ఒక ఆలయాన్ని సందర్శించారు. అక్కడ దంపతులిద్దరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భార్య నుదుటన తిలకం దిద్దిన అజిత్.. ఆ తర్వాత షాలిని కూడా అజిత్ కాళ్లకు నమస్కరించి భర్త ఆశీర్వాదాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ వీడియోని షాలిని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు.

షాలిని తాజాగా ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.." నా హృదయాన్ని కరిగించింది " అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్స్ బ్యూటిఫుల్ కపుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సడన్గా ఇలా గుడిలో ప్రత్యక్షమవడానికి కారణం.. కుటుంబ శ్రేయస్సు కోసం, అటు పలుమార్లు రేసింగ్ లో అజిత్ ప్రమాదాల బారిన పడుతుండగా.. వాటి నుంచి ఆయన జాగ్రత్తగా ఉండాలనే కారణంతోనే స్వామి వారికి ఇలా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సమాచారం.అయితే దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు.

ఇక అజిత్ కుమార్ - షాలినిల ప్రేమ విషయానికి వస్తే.. 1999లో వచ్చిన తమిళ చిత్రం 'అమర్కాలం' సినిమా షూటింగ్ సెట్ లో వీరి మధ్య ప్రేమ పుట్టినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు షాలిని మణికట్టుపై అజిత్ గాయం చేశారు. ఇక ఆ గాయం కోలుకోవడానికి అజిత్ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నారట. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందట. అలా సంవత్సరం పాటు డేటింగ్ చేసుకున్న వీరు.. 2000 సంవత్సరం ఏప్రిల్ 24న చెన్నైలో వివాహం చేసుకున్నారు. అటు కుటుంబ బాధ్యతలు చేపట్టిన షాలిని నటనకు స్వస్తి పలికింది. వీరికి అనౌష్క , ఆద్విక్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అజిత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన ఈయన.. తనకు ఇష్టమైన రేసింగ్లో పాల్గొంటూ అక్కడ తన అభిరుచిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది రెండు సినిమాలతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అజిత్ ప్రస్తుతం ఇంకా మరో మూవీని ప్రకటించలేదు. విరామం దొరికితే చాలు కార్ రేసింగ్ లో దూసుకుపోతూ తన అభిరుచిని చాటుకుంటున్న అజిత్ ఇప్పుడు ఇలా ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రస్తుతం కథలు వినే పనిలో ఉన్నారని, త్వరలోనే మరో మంచి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.