ఆ స్టార్ అసలు స్టామినా చూపిస్తాడా..?
ఐతే గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ అవ్వడం వల్ల అజిత్ నెక్స్ట్ సినిమా ఛాన్స్ కూడా ఆధిక్ రవిచంద్రన్ కే ఇచ్చాడు.
By: Ramesh Boddu | 17 Aug 2025 10:31 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన ఆధిక్ రవిచంద్రన్ సినిమా చేసే టైం లోనే ఇది ఓన్లీ అజిత్ ఫ్యాన్స్ కోసమే అని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే గుడ్ బ్యాడ్ అగ్లీ ఫ్యాన్స్ ఫీస్ట్ చేసుకునేలా వచ్చింది. సినిమా అజిత్ కు ఒక సూపర్ హిట్ ఇచ్చింది. ఆధిక్ మీద అజిత్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. ఐతే ఈ సినిమా చూసిన యాంటీ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఇది కేవలం ఫ్యాన్స్ కోసమే తీశారంటూ అజిత్ ఫ్యాన్స్ ఎటాక్ కూడా చేశారు.
అజిత్ నెక్స్ట్ సినిమా ఛాన్స్..
ఐతే గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ అవ్వడం వల్ల అజిత్ నెక్స్ట్ సినిమా ఛాన్స్ కూడా ఆధిక్ రవిచంద్రన్ కే ఇచ్చాడు. అజిత్ 64వ సినిమా కూడా ఆధిక్ చేస్తాడు. ఐతే ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా వెంటనే ఆధిక్ తోనే సినిమా చేయడం ఫ్యాన్స్ కి జోష్ ఇస్తుంది.
అజిత్ చేసిన సినిమాలన్నీ ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులకు ఏదో కొత్తదనం చూపించాలని ట్రై చేశారు అజిత్. కానీ అవేవి వర్క్ అవుట్ అవ్వట్లేదు. అందుకే గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఒక ఫన్నీ సినిమా చేశారు. అజిత్ సీరియస్ సినిమాలు చేస్తూ ఒకేసారి ఫన్ మోడ్ లో వెళ్లేసరికి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్ చేశారు.
కాంబో మరింత ఎంటర్టైన్ చేసేలా..
ఇక ఇప్పుడు అదే ఆధిక్ డైరెక్షన్ లో ఒక కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈసారి ఈ కాంబో మరింత ఎంటర్టైన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఐతే ఇది గుడ్ బ్యాడ్ అగ్లీలా కాకుండా కాస్త సీరియస్ టోన్ లోనే కథ ఉంటుందని తెలుస్తుంది. ఎలాగు హిట్ తో ఫాం లోకి వచ్చాం కాబట్టి నెక్స్ట్ సినిమాతో టార్గెట్ మరింత భారీగా పెట్టుకుంటున్నారట.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఛాన్స్ అందుకుంది. ప్రస్తుతం మైత్రి మేకర్స్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల నటిస్తుంది. ఆ సినిమాను కూడా మైత్రి వాళ్లే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
