పదేళ్ల వయసులోనే... సూపర్ స్టార్ కొడుకు మరి..!
సాధారణంగా హీరోల వారసులు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా హీరోల కొడుకులు హీరోలుగా మారుతూ ఉన్నారు.
By: Ramesh Palla | 29 Sept 2025 12:21 PM ISTతమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ సినిమాలపై ఎంత మక్కువ చూపిస్తాడో, మోటార్ స్పోర్ట్స్ పై అంతకు మించి మక్కువ చూపిస్తాడు. ఈ వయసులోనూ సొంత రేసింగ్ టీంను కలిగి ఉండటంతో పాటు, స్వయంగా తానే రేసింగ్‌లో పాల్గొని విజయాలను దక్కించుకోవడం మనం అజిత్ గురించి వార్తల్లో చూస్తూనే ఉంటాం. అజిత్ వంటి స్టార్ హీరో ఏడాదికి రెండు సినిమాలు చేస్తే రూ.100 కోట్ల ఆదాయం ఎటూ పోదు, పైగా ఏదైనా కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తే మరో వంద కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. అలాంటి అజిత్ సినిమాలను తక్కువగా చేస్తూ, మోటార్ స్పోర్ట్స్ పై ఎక్కువ శ్రద్ద కనబర్చడం మనం చూస్తూ ఉంటాం. ఆయనకు వాటి పట్ల ఉన్న అభిమానం, ఆసక్తి, ప్రేమ ఏంటో ఆయన తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా నిలిచిన అజిత్ దాదాపు మూడు దశాబ్దాలుగా తన ప్రస్థానంను కొనసాగిస్తున్నాడు.
అజిత్ కుమారుడు ఆద్విక్ కెరీర్
సాధారణంగా హీరోల వారసులు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా హీరోల కొడుకులు హీరోలుగా మారుతూ ఉన్నారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న చాలా మంది యంగ్ స్టార్ హీరోలు వారసులు అనే విషయం తెల్సిందే. అతి కొద్ది మంది మాత్రం తమ వారసులను ఇండస్ట్రీకి కాకుండా మరో రంగానికి పంపిస్తాను అని చెబుతూ ఉంటారు. అజిత్ ఆ కోవలోకి వస్తాడు. అజిత్ తనయుడు ఆద్విక్ కి ప్రస్తుతం పదేళ్ల వయసు. అతడు ఇప్పుడు సినిమాల పట్ల కాకుండా చదువు, మోటార్ స్పోర్ట్స్ పట్ల ఆసక్తి చూపిస్తున్నాడట. ఆ విషయాన్ని స్వయంగా అజిత్ చెప్పుకొచ్చాడు. తన కొడుకు కెరీర్‌ను నేను నిర్ణయించాలి అనుకోవడం లేదు, అతడు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో హెల్ప్ చేస్తాను, అతడు వెంట నేను ఎప్పుడూ ఉంటాను అనే ధైర్యం ను ఇస్తాను అన్నాడు.
మోటార్ రేసింగ్ వైపు ఆద్విక్
ఇటీవల ఆద్విక్ మోటార్ స్పోటర్స్ పై ఆసక్తిని కబర్చుతున్నట్లు అజిత్ పేర్కొన్నాడు. పదేళ్ల వయసులోనే గో - కార్డింగ్ తో ఆద్విక్ రేసింగ్ ప్రారంభించడం గర్వంగా ఉందని అజిత్ కుమార్ పేర్కొన్నాడు. ఆద్విక్ నిర్ణయాన్ని నేను ఎప్పుడూ ప్రభావితం చేయాలి అనుకోలేదు. అతడు మంచి నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా నా మద్దతు ఉంటుందని అతడికి తెలుసు. అందుకే అతడి యొక్క గో కార్డింగ్ రేస్‌కి నేను మద్దతుగా నిలిచాను. తండ్రిగా నా యొక్క బాధ్యత అనుసారం అతడిని ప్రోత్సహించేందుకు ముందు ఉంటాను. అతడి విజయాన్ని తండ్రిగా ఆస్వాదిస్తాను, గురువుగా అతడి భవిష్యత్తును తీర్చి దిద్దేందుకు నా వంతు కృషి చేస్తాను అంటూ అజిత్ పేర్కొన్నాడు. ఆద్విక్ విషయంలోనే కాకుండా కూతురు విషయంలోనూ కెరీర్ పరంగా పూర్తి స్వేచ్చను ఇస్తాను అంటూ పేర్కొన్నాడు. వారి జీవితాలను ప్రభావితం చేయాలని నేను అనుకోవడం లేదని అన్నాడు.
టాలీవుడ్, కోలీవుడ్‌లో అజిత్ కి ఫ్యాన్స్
ఇదే సమయంలో తనకు ఉన్న మోటార్ స్పోర్ట్స్ అభిరుచిని అడ్డుకోకుండా నా ఇష్టానికి ఎప్పుడూ విలువనిచ్చి, నన్ను అభిమానించిన షాలికి అజిత్ కృతజ్ఞతలు తెలియజేశాడు. మోటార్ రేసుల కోసం దేశ విదేశాలు, చాలా రోజులు వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో నా కుటుంబంకు నేను దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో పిల్లల అవసరాలను షాలిని చూసుకుంటూ నా బాధ్యత కూడా తానే మోస్తూ నాకు చాలా మద్దతుగా నిలిచింది. సినిమాలతో పాటు మోటార్ రేసింగ్ విషయంలో చాలా మద్దతును ఇవ్వడం వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అన్నాడు. షాలిని తన సినీ కెరీర్‌ను త్యాగం చేసి మరీ అజిత్ తో పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ వచ్చింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న అజిత్ కుమార్ రేసింగ్‌తో పాటు వరుస సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు.
