ఎదగనీయకుండా ఎన్నో కుట్రలు చేశారు
కోలీవుడ్ నటుడు అజిత్ సినీ పరిశ్రమలోకి వచ్చి 33 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ నోట్ ను షేర్ చేసుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 4 Aug 2025 12:00 PM ISTకోలీవుడ్ నటుడు అజిత్ సినీ పరిశ్రమలోకి వచ్చి 33 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ నోట్ ను షేర్ చేసుకున్నారు. ఆ నోట్ లో అజిత్ పలు విషయాల గురించి మాట్లాడారు. తాను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి కారణం తన అభిమానులు మరియు భార్య షాలినినే అని ఎంతో గర్వంగా తెలిపారు. ఇంతకీ అసలు అజిత్ ఆ నోట్ లో ఏం రాశారో తెలుసుకుందాం.
బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి..
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగి ఆదర్శంగా నిలవొచ్చని అజిత్ ప్రూవ్ చేశారు. కెరీర్ స్టార్టింగ్ లోనే లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న అజిత్, ఆ తర్వాత మాస్ హీరోగా మారి తమిళ ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకోవడంతో పాటూ కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రేసింగుల్లో పాల్గొంటూ సక్సెస్‌ఫుల్ గా ముందుకు దూసుకెళ్తున్నారు అజిత్.
ఎన్నో ఇబ్బందులు పడ్డా
ఈ సందర్భంగా తన సుదీర్ఘ ప్రయాణంలో తనకు తోడుగా ఉన్న ఫ్యాన్స్ కు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానని చెప్పిన అజిత్, తాను ఈ స్థాయికి అంత సులభంగా రాలేదని, తన ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడటంతో పాటూ ఎత్తు పల్లాలను చూశానని ఎమోషనల్ అయ్యారు. అన్ని సమయాల్లో ఫ్యాన్స్ అండగానే ఉన్నారని, సినిమాలు హిట్టైనా, ఫ్లాపైనా ఫ్యాన్స్ మాత్రం తనతోనే ఉన్నారని అజిత్ గుర్తు చేసుకున్నారు.
పడి లేచిన కెరటంలా..
33 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లను దాటానని, మరిన్ని మైలురాళ్లను దాటడానికి రెడీగా ఉన్నానని చెప్పారు అజిత్. ఈ జర్నీలో ఎన్ని ఎదురుదెబ్బలు, వైఫల్యాల ఎదురైనా వాటన్నింటినీ తట్టుకుని రెగ్యులర్ గా పోరాడుతూనే వచ్చానని, పరీక్ష ఏదైనా అందులో గెలిచి పడిలేచిన కెరటంలా తయారయ్యానని, ఎన్ని జరిగినా తన పట్టుదలను మాత్రం ఎప్పుడూ వదులుకోలేదని, సినిమాల్లో రాణిస్తూనే మోటార్ రేసింగ్ లో కూడా భాగమయ్యానని, అక్కడ కూడా తనకెన్నో ఎదురుదెబ్బలు తగిలాయని అజిత్ తెలిపారు.
దేశం గర్వపడేలా చేస్తా
రేసింగ్ లో తనను ఎదగనీయకుండా చేయాలని ఎందరో కుట్రలు చేశారని, చాలా అవమానాలు ఎదుర్కొన్నానని, కానీ అవన్నీ తిప్పి కొట్టి గెలిచానని,ఫెయిల్ అయిన ప్రతీసారీ ఫ్యాన్స్ చూపించే ప్రేమే తనను మరింత ముందుకు నడిపించిందని, వీటన్నింటికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తనకు తెలియడం లేదని, ఫ్యాన్స్ తో పాటూ తాను ఈ పొజిషన్ లో ఉండటానికి భార్య షాలినీ కూడా ముఖ్య కారణమని చెప్పారు అజిత్. ఫ్యాన్స్ తో ఎప్పుడూ నిజాయితీగా ఉండటానికే ప్రయత్నిస్తానని చెప్పిన అజిత్, రేసింగ్ లో దేశానికి మరిన్ని మెడల్స్ తీసుకొచ్చి దేశాన్ని గర్వపడేలా చేస్తానని తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
