యాక్షన్ స్టార్ సౌత్ సంచలనంతో!
ఒకేసారి అన్ని సినిమా షూటింగ్ ల్లో జాయిన్ అవ్వడంతో? చివరి రెండు చిత్రాల షూటింగ్ నెమ్మదిగా జరుగుతోంది.
By: Srikanth Kontham | 27 Aug 2025 10:18 AM ISTబాలీవుడ్ యాక్షన్ స్టార్ అజయ్ దేవగణ్ పుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు కొత్త రిలీజ్ లు ...మరోవైపు ఆన్ సెట్స్లోఉన్న చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. `ఆజాద్`, `రైడ్ 2`, `సన్నాఫ్ సర్దార్ 2` లాంటి చిత్రాలతో ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చారు. మాలీవుడ్ లో మోహన్ లాల్ , మమ్ముట్టిలా ఏడాదికి నాలుగైదు అయినా రిలీజ్ లు ఉండేలా అజయ్ దేవగణ్ చూసుకుంటారు. ఈ విషయంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో అజయ్ పోటీ పడుతుంటారు అప్పుడప్పుడు. ప్రస్తుతం `దేదే ప్యార్ దే 2` లో నటిస్తున్నారు.
ఆ రెండు కొత్త ఏడాదిలోనే:
షూటింగ్ దశలో ఉందీ చిత్రం. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయినట్లు వార్తలొస్తున్నాయి. మిగతా పనులన్నింటిని పూర్తి చేసి నవంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 14న రిలీజ్ తేదీ కూడా ప్రకటించారు. అలాగే `ధమాల్ 4`, `రేంజర్` చిత్రాల్లోనూ అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ఈ రెండు కూడా ఆన్ సెట్స్ లోనే ఉన్నాయి. రెండు చిత్రాలపై అంచ నాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ రెండు రిలీజ్ అయ్యేది కొత్త ఏడాదిలోనే.
ఆ కారణంగానే డిలే:
ఒకేసారి అన్ని సినిమా షూటింగ్ ల్లో జాయిన్ అవ్వడంతో? చివరి రెండు చిత్రాల షూటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. తొలుత `ధమాల్ 4` చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ డేట్లు సర్దుబాటు కాకపోవడంతో చిత్రీకరణ ఆలస్యంగా మొదలైంది. అలా సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అజయ్ దేవగణ్ ఇలా ఇన్నిచిత్రాలతో బిజీగా తాజాగా మరో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇటీవలే `సుప్రమ్ సో` చిత్రంతో సినీ ప్రియుల్లో నవ్వులు పూయించారు కన్నడ దర్శకుడు జె.పి తుమీ.
కొత్త ఏడాదిలోనే లాంచింగ్:
ఇదే దర్శకుడితో అజయ్ దేవగణ్ ఓ చిత్రం చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు వినిపిస్తోంది. తుమీ చెప్పిన స్టోరీ చెప్పడంతో చేద్దామని ప్రామిస్ చేసారుట. ప్రస్తుతం ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని తెలి సింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే కన్నడ పరిశ్రమకు చెందిన కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ రంగంలోకి దిగు తుందని సమాచారం. ఇదొక హారర్ కామెడీ నేపథ్యంలో సాగే కథగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తే తప్పక్లారిటీ రాదు. ఈ ప్రాజెక్ట్ లాక్ అయినా వచ్చే ఏడాదే ప్రారంభం అవుతుందని అజయ్ సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
