ఆ సంచలన ప్రాంచైజీలోనే సరికొత్త ప్రయత్నం!
అజయ్ దేవగణ్-రోహిత్ శెట్టి హిట్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ కలయికలో సినిమాలు అంటే? ఓ బ్రాండ్ గా మార్కెట్ లో రాణిస్తుంటాయి.
By: Srikanth Kontham | 10 Jan 2026 5:00 PM ISTఅజయ్ దేవగణ్-రోహిత్ శెట్టి హిట్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ కలయికలో సినిమాలు అంటే? ఓ బ్రాండ్ గా మార్కెట్ లో రాణిస్తుంటాయి. ఆ మధ్య రిలీజ్ అయిన 'సింగం ఎగైన్' కూడా థియేటర్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంచలన హిట్ ప్రాంచైజీ 'గోల్ మాల్' నుంచి పార్ట్ 5ని ప్రకటించి చాలా కాలమవుతోంది. కానీ ఇంత వరకూ మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. అజయ్ దేవగణ్-రోహిత్ శెట్టి వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు తప్ప! 'గోల్ మాల్ 5' గురించి ఎలాంటి సమాచారం అందించలేదు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. 'గోల్ మాల్ ఎగైన్' విడుదలై ఇప్పటికే తొమ్మిదేళ్లు పూర్తవుతుంది. అప్పటి నుంచి 'గోల్ మాల్' ప్రకటన రావడానికే ఎనిమిదేళ్లు సమయం పట్టింది. ఆ ప్రకటన వచ్చిన ఏడాదికి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. రోహిత్ శెట్టి మునుపటి చిత్రాలకన్నా? రాబోయే సీక్వెల్ మాత్రం 'గోల్ మాల్' ప్రపంచంలోనే ఓ కొత్త ప్రయత్నంగా నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. మునుపటి భాగాలకంటే నాలుగింతలు రెట్టింపు నవ్వులు పూయించేలా స్క్రిప్ట్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
అన్ లిమిటెడ్ గా నవ్వించడానికి, ఎంటర్ టైన్ చేయడానికి 'గోల్ మాల్ 5' తెరకెక్కిస్తామని గతంలోనే రోహిత్ శెట్టి తెలిపాడు. 'గోల్ మాల్' మొదటి భాగం 2006లో రిలీజ్ అయింది. అటుపై ఈ చిత్రానికి సీక్వెల్ గా 'గోల్ మాల్ రిటర్న్స్' 2008లో రిలీజ్ అయింది. ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. అనంతరం 2010లో 'గోల్ మాల్ 3'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అటుపై 2017 లో 'గోల్ మాల్ 4'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ రెండు భాగాలు మంచి విజయాలు సాధించాయి. అప్పటి నుంచి 'గోల్ మాల్ 5' ఎప్పుడని అభిమానులు అడుగుతున్నా? కాలం వెళ్లదీసారు.
ఇద్దరు వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో సాధ్యపడలేదు. తొమ్మిదేళ్లకు అజయ్-రోహితలకు తీరిక దొరికింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి..జాన్ అబ్రహం కథనా యకుడిగా ముంబై కమీషనర్ రాకేష్ మారియా బయోపిక్ ని తెరకెక్కి స్తున్నారు. రాకేష్ ముంబై కమీషనర్ గా ఉన్న సమయంలో గ్యాంగ్ స్టర్లపై ఎలా విరుచు కుపడ్డారు? ముంబైకి అతడు అందించిన సేవలు ఎలా నిలాచాయి? అన్న అంశాలన్నీ హైలైట్ చేస్తూ తెరకెక్కిస్తున్నారు. కాప్ స్టోరీలకు రోహిత్ బ్రాండ్ అంబాసిడర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక అజయ్ దేవగణ్ 'గోల్ మాల్ 5' షూటింగ్ కోసమే ఎదురు చూస్తున్నాడు.
