టెన్త్ క్లాస్ లోనే ఇంటర్మిడీయట్ వాళ్లని తన్నిన డైరెక్టర్!
వైవిధ్యమైన కథాంశాలతో, బోల్డ్ అండ్ రగ్గడ్ మేకింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో అజయ్ భూపతి .
By: Srikanth Kontham | 5 Aug 2026 12:00 AM ISTవైవిధ్యమైన కథాంశాలతో, బోల్డ్ అండ్ రగ్గడ్ మేకింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో అజయ్ భూపతి . `ఆర్ఎక్స్ 100` చిత్రంతో టెర్రిఫిక్ డెబ్యూ ఇచ్చిన అజయ్ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అటుపై మంగళవారం అంటూ మరో బోల్డ్ అటెంప్ట్ చేసి అంతకు మించి సంచలనం అయ్యారు. అజయ్ తెరపై ఎంతటి మాస్ .. ఇంటెన్స్ కంటెంట్‌ను చూపిస్తారో? నిజ జీవితంలోనూ ఆయన ప్రయాణం అంతే బోల్డ్‌గా.. అనేక ఆటుపోట్లతో సాగిందనే చెప్పాలి.
దర్శకుడు అజయ్ భూపతి చిన్ననాటి రోజులు ..చదువుకునే కాలం ఎంతో రభసగా గడిచాయని తెలుస్తోంది. సాధారణంగా విద్యార్థులు ఎవరితోనైనా గొడవ పడాలంటే తమతో సమానమైన వారితోనే తలపడతారు. కానీ అజయ్ భూపతి మాత్రం తాను పదవ తరగతి చదువుతున్న సమయంలోనే ఏకంగా తనకంటే పెద్దవారైన ఇంటర్మీడియట్ విద్యార్థులతో గొడవకు దిగి చితకబాదినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు.
అప్పట్లో అజయ్ చదువుకే పరిమితం కాలేదు. ఎక్కడైనా అన్యాయం జరిగినా లేదా గొడవలు జరిగినా ముందుండే వారట. అలా వివాదాలు, గొడవలతోనే ఆయన తన జీవితంలో మొదటి 21 ఏళ్లను చాలా రెబల్ తరహాలో గడిపారు. అప్పట్లో ఆయన చేసిన అల్లరి, ఊరులో నడిపిన హంగామా చూసి అందరూ ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో? అని ఆందోళన చెందేవారుట.
అయితే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒక నిర్దిష్ట వయసు వచ్చేసరికి అజయ్ ఆలోచనా విధానంలో పెను మార్పు వచ్చింది. తనలోని ఆవేశాన్ని, సృజనాత్మకతను సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా చదువు పూర్తయిన తర్వాత సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో అజయ్ జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది.
సినీ రంగంలో ప్రవేశించిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనేక కష్టాలను ఎదుర్కొని, రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేస్తూ మెుక్కవోని దీక్షతో పైకి వచ్చారు. గడచిన జీవితంలోని అనుభవాలను, మనుషుల భావోద్వేగాలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఆయన సిద్ధహస్తులయ్యారు. అజయ్ భూపతి జీవితంలోని ఆ రెబల్ అప్రోచ్‌యే ఆయన సినిమాల్లోని రా అండ్ రస్టిక్ పాత్రల రూపకల్పనకు ప్రధాన కారణమని చెప్పొచ్చు.
ఒకప్పుడు వివాదాలు.. గొడవలతో సాగిన కుర్రాడు ఇండస్ట్రీలో విజయవంతమైన దర్శకుడిగా ఎదగడం వెనుక ఎంతో పట్టుదల ఉంది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగితే ఏ రంగం లోనైనా రాణించవచ్చనడానికి అజయ్ భూపతి ప్రయాణం ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీలే అజయ్ భూపతి దర్శకత్వం వహించిన `శ్రీనివాస మంగాపురం`రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ చిత్రంతో కృష్ణమనవుడు జయకృష్ణ హీరోగా పరిచయం అయ్యాడు.
