జయకృష్ణ ఇండస్ట్రీలో లాంగ్ రన్ ఉంటాడు.. అజయ్ భూపతి
కథను నమ్మి మద్దతుగా నిలిచిన సీనియర్ నటుడు మోహన్ బాబు గారికి అజయ్ భూపతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
By: M Prashanth | 26 July 2026 1:37 PM ISTదర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైనర్ 'శ్రీనివాస మంగాపురం' జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రిలీజ్ ప్రెస్ మీట్‌లో అజయ్ భూపతి మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ తనకెంతో ఎమోషనల్ జర్నీ అని, మొదట్లో కాస్త టెన్షన్ అనిపించినా అవుట్‌పుట్ చూశాక పూర్తి నమ్మకం వచ్చిందని తెలిపారు. జయకృష్ణను హీరోగా పరిచయం చేయడంపై ఇంటర్వ్యూలలో అందరూ టెన్షన్ లేదా అని అడిగారని అజయ్ భూపతి గుర్తు చేసుకున్నారు.
షూటింగ్ టైమ్‌లో అసలు టెన్షన్ పడలేదని, కానీ గ్రాండ్ రిలీజ్ దగ్గర పడుతుండటంతో కాస్త ఆత్రుత పెరిగిందన్నారు. జయకృష్ణ నటన, ఎమోషనల్ సీన్స్‌లో చూపించిన పర్ఫార్మెన్స్ చాలా బాగుందని, తను ఒక్కటి రెండు సినిమాలతో ఆగిపోయే హీరో కాదని, మహేష్ బాబు గారిలా ఇండస్ట్రీలో 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్ తో కొనసాగుతాడు అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రాషా కాంబినేషన్, జయకృష్ణతో ఆమెకున్న పేరింగ్ స్క్రీన్ పై చాలా బాగుంటుందన్నారు. రాషా ఎక్స్‌ట్రోవర్ట్, జయకృష్ణ సైలెంట్‌గా ఉండే క్యారెక్టర్ అని పేర్కొన్నారు. మూవీలో కూడా వీళ్లిద్దరి క్యారెక్టరైజేషన్లు అలాగే సరిగ్గా సెట్ అయ్యాయని చెప్పారు. లీడ్ పెయిర్ ఇద్దరూ తమ రోల్స్‌కి పూర్తి న్యాయం చేసి పాస్ అయిపోయారని స్పష్టం చేశారు.
కథను నమ్మి మద్దతుగా నిలిచిన సీనియర్ నటుడు మోహన్ బాబు గారికి అజయ్ భూపతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చందేరీలోని వెయ్యేళ్ల నాటి పాత గుడిలో మోహన్ బాబు గారి కాంబినేషన్ సీన్స్ షూట్ చేశామని చెప్పారు. అంత పెద్ద స్టార్, లెజెండరీ యాక్టర్ అయినప్పటికీ సెట్స్‌లో ఎంతో వినయంగా ఉంటూ ప్రొడక్షన్ టీమ్‌కి పూర్తి సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు.
అలాగే నటుడు నరేష్ గారి పాత్ర గురించి చెబుతూ, ఆయన 'స్వతంత్ర బాబు' అనే ఒక డిఫరెంట్ అండ్ క్రేజీ క్యారెక్టర్ చేశారన్నారు. రోల్ వినగానే నరేష్ గారు వెంటనే ఓకే చేసి ఆ పాత్రలో ఒదిగిపోయారని చెప్పారు. బ్రహ్మాజీ, వాసుకి, కిక్ షామ్ లాంటి నటీనటులు, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ పెంచాయని తెలిపారు. చందేరీ, బళ్లారి, తిరుపతి, బెంగళూరు, మున్నార్ లాంటి సహజమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని క్వాలిటీగా నిర్మించినట్లు వెల్లడించారు.
దివంగత నటుడు కృష్ణ గారిపై ఆడియన్స్ అండ్ మీడియాకు ఉన్న అభిమానం తనకు తెలుసని, ఆ ప్రేమే జయకృష్ణకు కూడా దక్కుతుందని ఆశిస్తున్నట్లు అజయ్ భూపతి అన్నారు. సినిమా ఆరంభం నుంచే ప్రేక్షకులు కథలోకి ఇన్వాల్వ్ అయిపోతారని, ఎక్కడా ఆర్టిఫిషియాలిటీ లేకుండా నేచురల్ ఎమోషన్స్‌తో సాగుతుందని చెప్పారు. జులై 30న రాబోతున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి జయకృష్ణను, టీమ్‌ను ఆశీర్వదించాలని కోరారు.
