'శ్రీనివాస మంగాపురం'తో ఘట్టమనేని జయకృష్ణ..!
తిరుపతి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం టైటిల్ లాక్ చేశారు. పోస్టర్ లో హీరో, హీరోయిన్ ఇద్దరు ఒక తుపాకిని పట్టుకుని ఉన్నారు.
By: Ramesh Boddu | 27 Nov 2025 11:44 AM ISTఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ. టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో జయకృష్ణ సినిమా వస్తుంది. ఈ సినిమాను స్వప్న దత్, పి కిరణ్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తిరుపతి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం టైటిల్ లాక్ చేశారు. పోస్టర్ లో హీరో, హీరోయిన్ ఇద్దరు ఒక తుపాకిని పట్టుకుని ఉన్నారు. పోస్టర్ కింద ట్యాగ్ గా రెండు జీవితాలు.. ఒక ప్రయాణం, రెండు చేతులు.. ఒక ప్రమాణం, రెండు హృదయాలు ఒక విధి (డెస్టినీ) అంటూ కొటేషన్ పెట్టారు.
జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాశా థదాని..
చూస్తుంటే అజయ్ భూపతి డిఫరెంట్ ప్లానింగ్ తోనే ఈ మూవీ చేస్తున్నట్టు ఉన్నారు. ఈ సినిమాలో జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాశా థదాని హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస మంగాపురం పోస్టర్ తోనే ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాడు డైరెక్టర్ అజయ్ భూపతి.
ఘట్టమనేని వారసుడిగా జయకృష్ణకి ఇది బెస్ట్ లాంచ్ అనిపించేలా టైటిల్ పోస్టర్ ఉంది. ఆరెక్స్ 100తో అదరగొట్టిన అజయ్ భూపతి మంగళవారం తో మరో సర్ ప్రైజ్ చేశాడు. డైరెక్టర్ ఎంచుకునే ప్రతి కథ.. దానిలో డెప్త్ ని చూపించే ప్రయత్నం చేస్తాడు. అదే దారిలో ఈ శ్రీనివాస మంగాపురం సినిమా కూడా క్రేజీగా ఉండబోతుందని అనిపిస్తుంది.
లవ్ స్టోరీగా శ్రీనివాస మంగాపురం..
శ్రీనివాస మంగాపురం ఒక లవ్ స్టోరీగా రాబోతుంది. ఐతే తిరుపతి నేపథ్యంతో వస్తుంది కాబట్టి ఈ టైటిల్.. ఈ నేపథ్యం ఇంకాస్త ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించడం కూడా సినిమాకు మరింత బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాను స్వప్న దత్, ఆనంది ఆర్ట్స్ పి కిరణ్ కలిసి నిర్మిస్తున్నారు.
ఆరెక్స్ 100 సినిమాతో హీరోయిన్ ని విలన్ చేసి ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేశాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఇక రెండో ప్రయత్నంగా శర్వానంద్, సిద్ధార్థ్ తో మహా సముద్రం చేశాడు. ఐతే అది అంచనాలను అందుకోలేదు. ఇక ఆరెక్స్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తోనే మంగళవారం సినిమా చేసిన అజయ్ భూపతి ఆ సినిమాతో తన మార్క్ ఏంటో మరోసారి చాటుకున్నాడు. ఇక అజయ్ భూపతి నుంచి నాల్గవ ప్రాజెక్ట్ గా శ్రీనివాస మంగాపురం వస్తుంది. ఈ సినిమా కచ్చితంగా మరోసారి అజయ్ భూపతి డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ తో వస్తారని తెలుస్తుంది.
