వర్మ, వంగా.. ఇప్పుడు అజయ్ భూపతి!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్క దర్శకుడికి ఒక్కో రకమైన బ్రాండ్ ఉంటుంది. కొందరు చాలా సాఫ్ట్ గా, పద్ధతిగా మాట్లాడితే.. మరికొందరు మాత్రం ఎలాంటి ఫిల్టర్లు లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంటారు.
By: M Prashanth | 1 Aug 2026 1:02 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్క దర్శకుడికి ఒక్కో రకమైన బ్రాండ్ ఉంటుంది. కొందరు చాలా సాఫ్ట్ గా, పద్ధతిగా మాట్లాడితే.. మరికొందరు మాత్రం ఎలాంటి ఫిల్టర్లు లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంటారు. రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు ఇంటర్వ్యూలలో ఇచ్చే సూటి సమాధానాలు తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడు అదే వైభ్ లో దర్శకుడు అజయ్ భూపతి కూడా తనదైన బోల్డ్ ఆటిట్యూడ్ తో వార్తల్లో నిలుస్తున్నారు.
ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లలో ఆయన మాట్లాడిన తీరు హాట్ టాపిక్ గా మారింది. 'కల్ట్ సినిమా' అనే పదాన్ని ప్రమోషన్ల కోసం మేకర్స్ వాడుకోవడంపై స్పందిస్తూ, ఆ బిరుదు ఆడియన్సే ఇవ్వాలి తప్ప మనకు మనమే ఇచ్చుకోకూడదంటూ సూటిగా చెప్పేశారు. అలాగే తనకు అనిపించిన విషయాన్ని దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడటం అజయ్ భూపతి నైజం. ఈ ఆటిట్యూడే ఆయన సినిమాల్లోనూ, ఇంటర్వ్యూలలోనూ కనిపిస్తుంది.
'ఆర్ఎక్స్ 100' చిత్రంతోనే టాలీవుడ్ లో ఒక కొత్త తరహా రా అండ్ రస్టిక్ ట్రెండ్ సెట్ చేశారు. అజయ్. ఆ తర్వాత వచ్చిన 'మంగళవారం' సినిమాలోనూ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని చాలా బోల్డ్ గా, రాగా హ్యాండిల్ చేసి తనదైన మార్క్ ప్రూవ్ చేసుకున్నారు. కమర్షియల్ మూస ధోరణికి భిన్నంగా, సొసైటీలో ఉన్న కొన్ని పాయింట్స్ ని తెరపైకి తీసుకురావడంలో తన స్టైల్ ఎంతో నిరూపించుకున్నాడు.
కెమెరా ముందు మాత్రమే కాకుండా కెమెరా వెనుక కూడా అదే బోల్డ్ తరహా భావాన్ని మేంటైన్ చేయడం వల్ల ఆయన క్యారెక్టర్ ని కొందరు వర్మ, వంగా బాటలోని ఆటిట్యూడ్ తో పోలుస్తుంటారు. పైగా ఇతను వర్మ శిష్యుడే. వంగవీటి లాంటి సినిమాలకు సహాయక దర్శకుడిగా వర్క్ చేశాడు. ఇక డిప్లొమాటిక్ గా ఆన్సర్స్ ఇవ్వడం కంటే, ఉన్నది ఉన్నట్లు మొహం మీదే చెప్పే నైజం నేటి తరం సోషల్ మీడియా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతోంది.
లేటెస్ట్ గా వచ్చిన 'శ్రీనివాస మంగాపురం' సినిమా విషయంలోనూ ఆయన అదే నమ్మకంతో ఉన్నారు. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాను నమ్మిన రా కంటెంట్, ఇంటెన్స్ ఎమోషన్స్ ఈ సినిమాలోనూ సరికొత్తగా ఆకట్టుకుంటాయనే భావనలో మేకర్స్ ఉన్నారు. ఇక టాలీవుడ్ లో తనదైన బోల్డ్ స్టేట్‌మెంట్స్, బోల్డ్ సినిమాలతో సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అజయ్ భూపతి అప్రోచ్ డిఫరెంట్ గా ఉందనడంలో సందేహం లేదు. ఎలాంటి హంగులు లేకుండా స్ట్రెయిట్ గా మాట్లాడే ఈ ఆటిట్యూడ్ ఆయన అప్ కమింగ్ ప్రాజెక్టులకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.
