Begin typing your search above and press return to search.

కవలలకు జన్మనిచ్చిన 3 నెలల్లోనే 25 కిలోలు తగ్గిన నటి

కేవలం మూడు నెలల్లోనే 90 కిలోల నుంచి 65 కిలోలకు చేరుకున్నట్లు ఆమె వెల్లడించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 Aug 2026 5:22 PM IST
కవలలకు జన్మనిచ్చిన 3 నెలల్లోనే 25 కిలోలు తగ్గిన నటి
X

డెలివ‌రీ తర్వాత బరువు తగ్గడం చాలా మంది మహిళలకు పెద్ద సవాల్‌గా మారుతుంది. ముఖ్యంగా ట్విన్స్ కు జన్మనిచ్చిన తర్వాత శారీరకంగా కోలుకోవడం, పిల్ల‌ల సంరక్షణ, నిద్రలేమి వంటి కారణాలతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం అంత ఈజీ కాదు. అయితే కన్నడ టెలివిజ‌న్ నటి ఐశ్వర్య సలీమత్ తన పోస్ట్ డెలివరీ ఫిట్‌నెస్ జ‌ర్నీతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. కేవలం మూడు నెలల్లోనే 90 కిలోల నుంచి 65 కిలోలకు చేరుకున్నట్లు ఆమె వెల్లడించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అగ్నిసాక్షి, రామాచారి, సేవంతి, సరయూ వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన ఐశ్వర్య ప్రస్తుతం యాక్టింగ్ కు గ్యాప్ ఇచ్చి తన కవల పిల్లల సంరక్షణలో బిజీగా ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో ఐశ్వ‌ర్య, యాక్ట‌ర్ వినయ్ దంపతులకు కవలలు జన్మించారు. పిల్లల ఆరోగ్యంతో పాటు తన ఆరోగ్యాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలనే ఆలోచనతో లైఫ్ స్టైల్ లో మార్పులు ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.

బరువు తగ్గడానికి ఎలాంటి క్రాష్ డైట్‌ను ఫాలో అవ‌లేద‌ని, ఆహారపు అలవాట్లలో క్రమబద్ధమైన మార్పులే ప్రధాన కారణమని ఐశ్వర్య చెప్పడం విశేషం. గతంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకునేదాన్నని, ఇప్పుడు ప్రోటీన్, ఫైబర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నానని వెల్లడించారు. ఆమె రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, గుడ్లు, పనీర్, ఆకుకూరలు, మొలకెత్తిన పప్పులు, రాగి, పుట్టగొడుగులు, బాదం వంటి పోషకాహార పదార్థాలుంటాయని చెప్పారు.

దీంతో పాటూ ఎక్కువగా నీరు తాగడం, ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వడం, ప్రతిరోజూ వాకింగ్ చేయడం తన దినచర్యలో భాగమని తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు పాలిచ్చే తల్లులు హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. త‌న టార్గెట్ కేవలం బరువు తగ్గడం మాత్రమే కాద‌ని, పిల్లలను ఆరోగ్యంగా చూసుకోవాలంటే తాను కూడా ఫిజిక‌ల్ గా, మెంట‌ల్ గా ఆరోగ్యంగా ఉండాలని భావించానని చెప్పారు. బ్యాలెన్డ్స్ ఫుడ్, తగిన శారీరక చలనం వల్ల మూడ్ స్వింగ్స్ కూడా తగ్గాయని ఆమె పేర్కొన్నారు. పోస్ట్ డెలివరీ ఫిట్‌నెస్ అంటే ఆకలితో ఉండటం లేదా వేగంగా బరువు తగ్గడం కాదని, హెల్తీ లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకోవడమే ముఖ్యమని ఐశ్వర్య సలీమత్ ప్రయాణం మరోసారి గుర్తు చేస్తోంది.