Begin typing your search above and press return to search.

ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్‌తో క‌న్న‌డ మేక‌ర్స్ భారీ మూవీ!

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూతురు, హీరో ధ‌నుష్ మాజీ భార్య ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ మ‌రో కొత్త ప్రాజెక్ట్‌కు రెడీ అవుతోంది.

By:  Ravindar Gorantla   |   26 Feb 2026 10:42 PM IST
ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్‌తో క‌న్న‌డ మేక‌ర్స్ భారీ మూవీ!
X

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూతురు, హీరో ధ‌నుష్ మాజీ భార్య ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ మ‌రో కొత్త ప్రాజెక్ట్‌కు రెడీ అవుతోంది. హీరో ధ‌నుష్‌తో త‌న వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికిన ఐశ్వ‌ర్య అదే ఏడాది తండ్రి ర‌జ‌నీకాంత్ కీల‌క గెస్ట్ క్యారెక్ట‌ర్‌లో, విష్ణు విశాల్‌, విక్రాంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా `లాల్ స‌లామ్‌` మూవీని రూపొందించింది. 2024లో విడుద‌లైన ఈ సినిమాని ర‌జ‌నీ క్యామియో కాపాడ‌లేక‌పోయింది. దీంతో కొంత విరామం తీసుకున్న ఐశ్వ‌ర్య ఈ ఏడాది కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీ‌కారం చుడుతోంది.

క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో వంద‌కు పైగా తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ చిత్రాల‌ని క‌ర్ణాట‌క‌లో విడుద‌ల చేసి, ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది సినిమాల్ని నిర్మించిన కేజీఆర్ స్టూడియోస్‌తో క‌లిసి ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుడుతున్నారు. రీసెంట్ త‌మిళ హిట్ ఫిల్మ్ `త‌లైవ‌ర్ తంబి త‌లైమెయిల్‌` మేక‌ర్స్‌తో ఇటీవ‌లే ఓ మూవీని ప్ర‌క‌టించిన ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ తాజాగా క‌న్న‌డ నిర్మాణ సంస్థ కేజీఆర్ గ్రూప్‌ స్టూడియోస్‌తో క‌లిసి ఓ భారీ సినిమాకు ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక అనౌన్స్ మెంట్‌ని మేక‌ర్స్ గురువారం ప్ర‌క‌టించారు.

సినిమా ఓ అర్థ‌వంత‌మైన భాగ‌స్వామ్యంతో వృద్ది చెందుతుంద‌ని బ‌లంగా న‌మ్మే నిర్మాణ సంస్థ మాది. ఫిల్మ్ మేకింగ్ అనేది నిజంగా ఉమ్మ‌డి దృష్టి, అభిరుచి, న‌మ్మ‌కంపై నిర్మించిన ఓ స‌మిస్టి క‌ళ‌. క‌న్న ర‌వి గ్రూప్‌, కేఆర్‌జీ గ్రూప్స్ ప్రొడ‌క్ష‌న్ నం.9ని ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి ప్ర‌క‌టిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్‌ని త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో దేశ వ్యాప్తంగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం. ప‌వ‌ర్‌ఫుల్ ఎంగేజింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్‌ని ఈ సినిమాతో ఆడియ‌న్స్‌కి అందిస్తామ‌ని ప్రామిస్ చేస్తున్నాం.

ఈ మూవీని ప్ర‌జెంట్ చేస్తున్నందుకు గౌర‌వంగా భావిస్తున్నాం. ఈ ప్రెస్టేజియ‌స్ వెంచ‌ర్ నిజ‌మైన మ‌ర్చిపోలేని అనుభూతిని ప్రేక్ష‌కుల‌కు అందిస్తుంద‌ని న‌మ్ముతున్నాం` అంటూ ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌లో ఓ ప‌వ‌ర్‌ఫుల్ మూవీని నిర్మిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అయితే అది ఎవ‌రితో ఉంటుంది? ఏ జోన‌ర్‌లో ఉంటంద‌న్న‌ది మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ క‌న్న‌డ నిర్మాణ సంస్థ ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది చిత్రాల‌ని నిర్మించింది. ఇందులో ఆరు ఇప్ప‌టికే విడుద‌ల‌య్యాయి.

మ‌రో రెండు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. `పుష్ప‌` విల‌న్ డాలీ ధ‌నంజ‌య్‌తో ప్ర‌స్తుతం `ఉత్త‌రాకాండ‌`ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ `లాల్ స‌లామ్‌` త‌రువాత ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. క‌న్న‌డ నిర్మాణ సంస్థ నేతృత్వంలో చేయ‌బోయే ప్రాజెక్ట్ ర‌జ‌నీ బ‌యోపిక్ అవుతుందా? లేక మ‌రో సినిమానా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.