రెండు వందల కోసం వెంకీ హీరోయిన్ ఏం చేసిందంటే..!
ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన అంశాన్ని పంచుకుంది ఐశ్వర్యా రాజేష్..ఒకే ఒక జీవితం. హ్యాపీగా ఉందాం..చుట్టూ ఉన్న వాళ్లని ఆనందంగా ఉంచుదాం.
By: Tupaki Entertainment Desk | 4 Feb 2026 11:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో స్టార్ సన్ అంటే స్టార్..స్టార్ డాటర్ అంటే స్టార్..వాళ్లని గోల్డెన్ స్పూన్‌తో పుట్టారని అంతా భావిస్తూ ఉంటారు. అలాగే ట్రీట్ చేస్తుంటారు కూడా. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల వారసుల పరిస్థితి మరోలా ఉంటుంది. అదే పరిస్థితిని అనుభవించిందట హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. ఆమె ఫాదర్ ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు రాజేష్ అన్న విషయం అందరికి తెలిసిందే. 38 ఏళ్ల వయసులో ఆరోగ్య కారణాల వల్ల ఆయన మృతి చెందారు. అప్పటికే నలుగురు పిల్లలు వారిలో ఐశ్వర్య చివరి సంతానం.

తన తండ్రి రాజేష్ మృతి చెందిన తరువాత తన ఫ్యామిలీ చాలా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొందని ఈ సందర్భంగా ఓ పోడ్ కాస్ట్‌లో వెల్లడించింది ఐశ్వర్యా రాజేష్. తండ్రి కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కొనసాగడం, చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటంబ భారాన్నంత తల్లీ మోసిందని, ఆ టైమ్‌లో తన ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొందని వెల్లడించింది. అమ్మ ఒక్కరే కష్టపడుతుండటంతో అది చూడలేక నేను కూడా నా వంతు కష్టపడటం, డబ్బులు సంపాదించడం మొదలు పెట్టానని తెలిపింది.
టెన్త్ చదువుతున్న రోజుల్లోనే డబ్బులు సంపాదించడం ప్రారంభించాను. రూ.250, రూ.500 వచ్చేలాగా ఏదో ఒక చిన్న పని చేస్తూ అమ్మకు సహాయంగా ఉండటం మొదలు పెట్టాను. ఆ డబ్బుల కోసం బర్త్ డే పార్టీలకు హోస్ట్‌గా వ్యవహరించడం, అదే తరహాలో మరో చిన్నవర్క్ చేయడం వంటివి చేశాను. కాలేజ్ కు వచ్చే సరికి రియాలిటీ డ్యాన్స్ షోలో పాల్గొన్నాను. తిరుపతిలోని మోహన్‌బాబు శ్రీవిద్యానికేతన్ ఇనిస్టిట్యూట్‌లో నేను, మా ముగ్గురు అన్నయ్యలు చదువుకున్నాం. 8వ స్టాండర్డ్‌లో మా మాదర్ నన్ను అక్కడి స్కూల్ మాన్పించింది.
చెన్నైలో నా స్టడీ సాగింది. హౌసింగ్ మోర్డ్‌లో నా చైల్డ్ హుడ్ అంతా సాగింది. నా జీవితంలో చాలా మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయి. టీ నగర్‌లో ఉండేవాళ్లం. 20 ఏళ్ల వయసులో ఒక అన్న చనిపోయాడు. మరో బ్రదర్ ఏడాదిన్నర తరువాత ఓ యాక్సిడెంట్‌లో చనిపోవడం జరిగింది. వెంట వెంటనే ఇద్దరు అన్నయ్యలు చనిపోవడం అమ్మ తట్టుకోలేకపోయింది. ఆ పీరియడ్ మాకు ఓ టఫ్ అని చెప్పాలి. మా అమ్మ విల్ పవర్‌తో అన్నింటిని తట్టుకుని నిలబడింది. బహుషా ఆమె విల్ పవరే నాకు వచ్చిందేమో. నాన్నలేని లోటు తెలియకుండా మా ఇద్దరిని అమ్మ బాగా చూసుకుంది` అని తెలిపింది.
ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన అంశాన్ని పంచుకుంది ఐశ్వర్యా రాజేష్..ఒకే ఒక జీవితం. హ్యాపీగా ఉందాం..చుట్టూ ఉన్న వాళ్లని ఆనందంగా ఉంచుదాం.మనం నవ్వుదాం..మనతో పాటు నలుగురినీ నవ్విద్దాం అన్నదే నా పాలసీ` అని చెప్పింది. ఇక తెలుగులో తనకు `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ వరకు బ్రేక్ రాకపోవడంపై స్పందించింది. వరల్డ్ ఫేమస్ లవర్, టక్‌జగదీష్, రిపబ్లిక్ వంటి సినిమాలు చేసినా కానీ బ్రేక్ రాలేదు. ఈ విషయంలో మా అమ్మకు ఆ వెలితి ఉండేది. మదర్ టంగ్ తెలుగు, నాన్న గారు తెలుగులో నటించారు. మా తాతగారు అమర్‌నాథ్‌గారు కూడా తెలుగులో యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.
అత్త శ్రీలక్ష్మీగారు కూడా మంచి నటి.. అలాంటిది నీకు తెలుగులో ఎందుకు అవకాశాలు రావడం తేదని అడిగేది. ఎందుకో నాకు తెలియట్లేదమ్మా అని చెప్పేదాన్ని. అలా ఎదురు చూస్తున్న టైమ్‌లోనే అనిల్ గారి నుంచి ఫోన్ వచ్చింది` అంటూ చెప్పుకొచ్చింది. అయితే గత ఏడాది తెలుగులో బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకున్న ఐశ్వర్యకు ప్రస్తుతం తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. కన్నడలో శివరాజ్‌కుమార్, ధనంజయ నటిస్తున్న `ఉత్తరకాండ`లో నటిస్తోంది. ఇది ఆమె నటిస్తున్న తొలి కన్నడ మూవీ.
