Begin typing your search above and press return to search.

న్యూయార్క్ వైబ్స్‌లో క్యాజువల్ అవతార్… ఐశ్వర్య రాజేష్ లుక్ వైరల్

న్యూయార్క్ వీధుల్లో ఐశ్వర్య రాజేష్ ధరించిన అవుట్‌ఫిట్ ప్రస్తుతం ఫ్యాషన్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె 'అసూస్ డిజైన్ ' బ్రాండ్‌కు చెందిన 'క్రోచెట్ బార్డోట్ మిడి డ్రెస్' వేసుకుంది.

By:  Madhu Reddy   |   6 July 2026 12:00 PM IST
న్యూయార్క్ వైబ్స్‌లో క్యాజువల్ అవతార్… ఐశ్వర్య రాజేష్ లుక్ వైరల్
X

సౌత్ ఇండియన్ సినిమా పవర్‌హౌస్ పర్‌ఫార్మర్ ఐశ్వర్య రాజేష్.. కేవలం నటనతోనే కాకుండా తన స్టైలిష్ లుక్స్‌తోనూ నెటిజన్లను ఫిదా చేస్తోంది. తాజాగా న్యూయార్క్ వీధుల్లో ఆమె దిగిన కొన్ని స్టన్నింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ అప్పీల్, డౌన్-టు-ఎర్త్ చార్మ్‌తో న్యూయార్క్ బ్యాక్‌డ్రాప్‌లో ఐశ్వర్య ఇచ్చిన క్యాజువల్ చిక్ పోజులు ఫ్యాన్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ అదిరిపోయే లుక్ విశేషాలు మీకోసం.

అదిరిపోయే డ్రెస్.. ట్రెండీ యాక్సెసరీస్:

న్యూయార్క్ వీధుల్లో ఐశ్వర్య రాజేష్ ధరించిన అవుట్‌ఫిట్ ప్రస్తుతం ఫ్యాషన్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె 'అసూస్ డిజైన్ ' బ్రాండ్‌కు చెందిన 'క్రోచెట్ బార్డోట్ మిడి డ్రెస్' వేసుకుంది. ఈ డ్రెస్‌కు ఉన్న బ్లాక్ నెట్టెడ్ బాడీ సెక్షన్, దానికి మ్యాచ్ చేస్తూ వచ్చిన పింక్ అండ్ గ్రీన్ ఫ్లోరల్ ప్రింటెడ్ లైట్ వెయిట్ స్కర్ట్ లుక్ చాలా యూనిక్‌గా ఉంది. ఇక దీనికి తోడు స్టైలిష్ బ్లాక్ ఓవల్ సన్‌గ్లాసెస్, చేతిలో వైట్ స్ట్రక్చరల్ షోల్డర్ బ్యాగ్, కాళ్లకు సింపుల్ స్నీకర్స్ వేసుకుని ఐశ్వర్య పక్కా మోడ్రన్ గర్ల్‌లా మెరిసిపోతోంది.

న్యూయార్క్ వీధుల్లో గ్లామర్ మెరుపులు:

గాలికి ఎగురుతున్న జుట్టుతో, ఎలాంటి హంగూ ఆర్భాటం లేని ఎఫర్ట్‌లెస్ స్టైల్‌తో ఐశ్వర్య రాజేష్ న్యూయార్క్ ట్రాఫిక్ లైట్స్, అక్కడి వైబ్రంట్ సిటీ వాతావరణం మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డుపై వెళ్లేవారంతా అలా చూస్తూ ఉండిపోయారు. ఇక ఒక చేతిని జుట్టులో పెట్టుకుని ఆమె ఇచ్చిన కాన్ఫిడెంట్ క్యాజువల్ పోజ్.. ఆమెలోని స్టార్ పవర్‌ను, గ్లోబల్ గ్లామర్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ క్యాండిడ్ మూమెంట్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

టెలివిజన్ యాంకర్ నుండి పవర్‌హౌస్ స్టార్ వరకు:

కెరీర్ మొదట్లో టెలివిజన్ యాంకర్‌గా, రియాలిటీ షో కంటెస్టెంట్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ఐశ్వర్య రాజేష్.. అట్టకత్తి, కాకా ముట్టై సినిమాలతో నటిగా తన విశ్వరూపం చూపించింది. ఆ సినిమాలకు బెస్ట్ యాక్ట్రెస్‌గా తమిళనాడు స్టేట్ అవార్డు కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత వడ చెన్నై, కణా సినిమాలతో వర్సటైల్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూ దూసుకుపోతోంది.

క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఐశ్వర్య:

గత ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. హీరో తిరువీర్ సరసన ఆమె నటిస్తున్న 'ఓ..! సుకుమారి'తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న 'మహేంద్రగిరి వరాహి' సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక వీటితో పాటే కిచ్చా సుదీప్, విక్రాంత్‌లతో కలిసి ఆమె నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'అండర్-18', అలాగే కరుప్పర్ నగరం, ఉత్తరకాండ వంటి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.

గ్లోబల్ రేంజ్‌లో ఐశ్వర్య క్రేజ్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూనే, ఇటు గ్లామర్ పరంగానూ ఐశ్వర్య రాజేష్ రోజురోజుకూ తన రేంజ్‌ను పెంచేసుకుంటోంది. తాజాగా న్యూయార్క్ స్ట్రీట్స్‌లో ఆమె చేసిన ఈ సందడి ఆమె గ్లోబల్ అప్పీల్‌ను మరింత పెంచిందని చెప్పొచ్చు. ఇక ఒకవైపు నటనతో, మరోవైపు ఇలాంటి స్టైలిష్ అప్‌డేట్స్‌తో అలరిస్తున్న ఐశ్వర్య.. రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.