Begin typing your search above and press return to search.

ఐశ్వర్య రాజేష్ డేరింగ్ డెసిష‌న్!

తాజా స‌మాచారం ప్ర‌కారం, ఐశ్వ‌ర్య ఓ స్టార్ హీరో సినిమాలో కథను మలుపుతిప్పే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ లో నటించనున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 July 2026 5:58 PM IST
ఐశ్వర్య రాజేష్ డేరింగ్ డెసిష‌న్!
X

ఐశ్వర్య రాజేష్ కెరీర్‌లో మరో ఆసక్తికర మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు నటిగా తన సహజ అభినయం, ఎమోష‌న్స్ కు ప్రాధాన్యమున్న పాత్రలు, స్ట్రాంగ్ క్యారెక్ట‌రైజేష‌న్ ఉన్న క్యారెక్ట‌ర్ల‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు పూర్తిగా భిన్నంగా కనిపించేందుకు రెడీ అవుతున్న‌ట్టు సినీ వర్గాల్లో డిస్క‌ష‌న్ జరుగుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం, ఐశ్వ‌ర్య ఓ స్టార్ హీరో సినిమాలో కథను మలుపుతిప్పే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ లో నటించనున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుంటుంది. అయితే ఇటీవలి కాలంలో చాలా మంది నటీమణులు స్క్రీన్ టైమ్ కంటే పాత్రకు ఉన్న బలం, కథపై దాని ప్రభావాన్ని ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఐశ్వర్య రాజేశ్ కూడా అదే దారిని ఎంచుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హీరోతో జోడీగా కనిపించడం కంటే, కథను ముందుకు నడిపించే కీలక పాత్రలో కనిపించడం ద్వారా నటిగా మరో మెట్టు ఎక్కాలనే ప్రయత్నంగా దీనిని చూస్తున్నారు.

కెరీర్ స్టార్టింగ్ నుంచి ఐశ్వర్య రాజేష్ గ్లామర్ కంటే యాక్టింగ్ కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలనే ఎక్కువగా ఎంపిక చేసుకున్నారు. విభిన్న ఎమోష‌న్స్ కలిగిన పాత్రలు, సామాజిక అంశాలతో కూడిన కథలతో ఆమె ఇప్పటికే తనదైన ముద్ర వేశారు. ఇప్పుడ‌దే ప్రయాణాన్ని మరో కోణంలో విస్తరిస్తూ, పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ల‌ను స్వీకరిస్తే అది ఆమె ఫిల్మోగ్రఫీలో స్పెష‌ల్ చాప్ట‌ర్ గా నిలిచే అవకాశ‌ముంద‌ని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆడియ‌న్స్ కూడా సంప్రదాయ విలన్ పాత్రల కంటే, పరిస్థితుల ప్రభావంతో రూపుదిద్దుకునే పాత్ర‌ల‌ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. అలాంటి పాత్రల్లో నటికి ఎమోష‌న్స్ తో పాటూ మానసిక సంఘర్షణను కూడా సమతూకంగా ఆవిష్కరించే అవకాశ‌ముంటుంది. అలాంటి పాత్రలను సమర్థంగా పోషిస్తే నటిగా ఆమె సామర్థ్యానికి మరో కొత్త కోణం జోడించబడుతుంది.

ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటి పాత్రలు కేవలం అలంకారంగా ఉండకుండా కథలో కీలక మలుపులకు కారణమయ్యేలా రూపుదిద్దుకుంటున్నాయి. అందువల్ల ఐశ్వర్య రాజేశ్ పోషించనున్న పాత్ర కూడా కథ దిశను మార్చే స్థాయిలో ఉండే అవకాశాలపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కమర్షియల్ సినిమా అయినా, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా అయినా పాత్రలో వైవిధ్యమే తనకు ముఖ్యమనే సంకేతాన్ని ఐశ్వ‌ర్యా మరోసారి ఇవ్వబోతున్నారని ఇండ‌స్ట్రీలో డిస్క‌ష‌న్ సాగుతోంది.