కళ్ళు చెదిరే గెటప్ లో ఐశ్వర్య లేటెస్ట్ లుక్!
ఇకపోతే ప్రస్తుతం ఈమె పలు భాషా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ.. మరొకవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
By: Madhu Reddy | 11 Jun 2026 10:31 AM ISTస్వర్గీయ నటులు రాజేష్ కూతురుగా సినీ ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది ఐశ్వర్య రాజేష్. ముద్దు ముద్దు మాటలతో రాజేంద్రప్రసాద్ రాంబంటు సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. తమిళంలో ఎక్కువగా సినిమాలు చేస్తూ హీరోయిన్గా స్థిరపడింది. ఇక తెలుగులో మళ్ళీ అదే రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ పోషించిన కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా నటిగా తెలుగు తెరకు పరిచయమైన ఈమె..ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ , టక్ జగదీష్ అంటూ పలు చిత్రాలు చేసి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ సరసన భాగ్యం పాత్రలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేసి అదరగొట్టేసింది. ఈ పాత్రకు ఐశ్వర్య తప్ప మరొకరు న్యాయం చేయలేరు అనే రేంజ్ లో నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఐశ్వర్య. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈమె ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ సమయంలో అనుకున్నంత స్థాయిలో అవకాశాలు లభించలేదు. దాంతో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ సందడి చేసిన ఐశ్వర్య రాజేష్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది.
ఇకపోతే ప్రస్తుతం ఈమె పలు భాషా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ.. మరొకవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వాస్తవానికి ఐశ్వర్య రాజేష్ నటిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్ ను కూడా కలిగి ఉంది. ట్రెడిషనల్ డ్రెస్ ల నుండి వెస్ట్రన్ స్టైల్ వరకు అన్నింటిలో కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఐశ్వర్య ఒకవైపు సాంప్రదాయంగా పట్టు చీరలు, అందమైన లెహంగాలు, మోడ్రన్ డిజైనర్ శారీలలో ఆకర్షణీయంగా కనిపిస్తూ.. ట్రెడిషనల్ వేర్ లో కూడా పర్ఫెక్ట్ నిరూపించుకుంటోంది. సాంప్రదాయంగానే కాదు బోర్డ్ రూమ్ మీటింగ్స్ లేదా రెడ్ కార్పెట్ ఈవెంట్ల కోసం తరచుగా మెరూన్ లేదా ఇతర డార్క్ కలర్ వెస్ట్ కోట్ అండ్ బ్రౌజర్ సెట్లను ధరిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే ఈమె తాజాగా మరో ఔట్ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
స్లీవ్ లెస్ డీప్ వీ నెక్ కలిగిన నేవీ బ్లూ కలర్ క్రాప్ టాప్ ధరించి దీనికి కాంబినేషన్ లో డెనిమ్ జీన్స్ ధరించి తన అవుట్ ఫిట్ ను స్టైల్ చేసింది. మెడలో చైన్స్ వేసి జుట్టును వదిలేసి తన మేకోవర్ను ఫుల్ ఫిల్ చేసింది. ఇక ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ లో గ్లామర్ వలకబోస్తూ ఫ్యాషన్ కి కొత్త నిర్వచనం చూపించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నిజ జీవిత సంఘటన ఆధారంగా నేర ప్రపంచం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఎమోషనల్ డ్రామా అండర్ 18 లో నటిస్తోంది . దీనికి కార్తీక్ పెరుమాళ్ సామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు మహేంద్రగిరి వారాహి చిత్రంలో కూడా నటిస్తోంది. అంతేకాదు అమోగ్ విజయ్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంతో ఐశ్వర్య రాజేష్ కన్నడ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతోంది. ఇక ఇవి కాకుండా మరికొన్ని తమిళ్ , తెలుగు ప్రాజెక్టులకు ఈమె సంతకం చేసింది.
