Begin typing your search above and press return to search.

రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఐశ్వ‌ర్యారాయ్ మెరుపులు

ఈ సంవత్సరం మహిళలే ప్యానెల్‌లను నడుపుతున్నారు.. మాస్టర్‌క్లాస్‌లకు నాయకత్వం వహిస్తున్నారు.. ఈవెంట్‌ను నిర్వచించే సంభాషణలతో ర‌క్తి క‌ట్టిస్తున్నారు!

By:  Sivaji Kontham   |   7 Dec 2025 1:44 PM IST
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఐశ్వ‌ర్యారాయ్ మెరుపులు
X

అంత‌ర్జాతీయ సినిమా ఉత్స‌వాల‌లో మెరుపులు మెరిపించ‌డం ఐశ్వ‌ర్యారాయ్ కి కొత్తేమీ కాదు. కేన్స్ ఫిలింఫెస్టివ‌ల్ లో ద‌శాబ్ధాలుగా పాల్గొంటున్న ఐష్ ఆ ఉత్స‌వాల‌కు ప్ర‌తియేటా ప్ర‌త్యేక గ్లామ‌ర్‌ను జోడిస్తున్నారు. ఇంకా చాలా అంత‌ర్జాతీయ సినిమా పండ‌గ‌ల్లో ఐష్ రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌కు సంబంధించిన ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ లో సంద‌డి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు `జెడ్డా, సౌదీ అరేబియా: 2025`లో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మూడో రోజు ఐశ్వ‌ర్యారాయ్ రెడ్ కార్పెట్ పై మెరుపులు మెరిపించారు

మ‌హిళ‌ల అభ‌ద్ర‌తా భావం గురించి ఈ వేదిక‌పై ఐష్ మాట్లాడారు. ఇంకా అవే పాత కాలం ప్ర‌శ్న‌లు మ‌హిళ‌ల‌కు ఎదుర‌వుతున్నాయి.. వాటిని మార్చాల్సి ఉంద‌ని కూడా అన్నారు. అంతేకాదు... ఈ ఉత్స‌వం మ‌హిళామ‌ణుల కోసం మ‌హారాణుల కోసం అంటూ ఉత్సాహం చూపించారు ఐష్‌. గల్ఫ్ న్యూస్‌కు చెందిన మంజుషా రాధాకృష్ణన్ జెడ్డా మైదానంలో చ‌ర్చా స‌మావేశంలో ఉన్నారు. ఈ సంవత్సరం మహిళా సినిమాలు, గుర్తింపుపై చ‌ర్చా స‌మావేశాల‌ను నిర్వ‌హించారు.

ఈ సంవత్సరం మహిళలే ప్యానెల్‌లను నడుపుతున్నారు.. మాస్టర్‌క్లాస్‌లకు నాయకత్వం వహిస్తున్నారు.. ఈవెంట్‌ను నిర్వచించే సంభాషణలతో ర‌క్తి క‌ట్టిస్తున్నారు! ఇలాంటి ప్ర‌త్యేక వేదిక‌పై ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ రోజును ప్రశాంతంగా ప్రారంభించారు. ఈ వేదిక‌పై త‌న కెరీర్, మాతృత్వం, జీవితాశయం గురించి ఐష్ మాట్లాడారు. అలాగే సోష‌ల్ మీడియాలు ఎప్పుడూ నిజాల్ని నిర్ధేశించ‌లేవ‌ని, వాటిని తాను ప‌ట్టించుకోన‌ని కూడా ఐశ్వ‌ర్యారాయ్ అన్నారు.

ఇక ఇదే వేదిక‌పై అనా డి అర్మాస్ మాస్ట‌ర్ క్లాస్ కూడా ఆక‌ట్టుకుంది. హవానా నుండి మాడ్రిడ్ వ‌ర‌కూ, మాడ్రిడ్ నుండి లాస్ ఏంజిల్స్ వరకు తన ప్రయాణం గురించి, సినీకెరీర్‌ను నిర్మించడంలో ప్రాక్టిక‌ల్ స‌వాళ్లు, వాస్తవాల గురించి నిజాయితీగా మాట్లాడింది. న‌టిగా కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎలా ఎదురుదెబ్బలు తిన్నారో, భాషా అడ్డంకులను ఎలా ఎదుర్కొన్నారో కూడా అనా డి అర్మాస్ వెల్ల‌డించారు. ``సౌదీ నాకు క్యూబాను గుర్తు చేసింది.. ఇక్కడ శక్తి... బాగా ప‌రిచ‌యం ఉన్న స్థ‌లంలా.. ఇది నాకు ఇల్లు లాగా అనిపిస్తోంద‌``ని అన్నారు. ఆప్టిక్స్ కంటే క్రమశిక్షణ, ఉత్సుకత, పట్టుదల నుండి విజయం సాధించిన వ్యక్తి గా అనా డి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ ప్యానెల్ లో డకోటా జాన్సన్ కూడా త‌న స్పీచ్ తో ఆక‌ట్టుకున్నారు. `నటన అనేది ఒక బుడగ` అని డకోటా జాన్స‌న్ అన్నారు. ఫిలింమేకింగ్ మిమ్మల్ని తెర వెనుక చూడటానికి ప‌ర్మిష‌న్ ఇస్తుంది.. ఇది క్రూరమైనది అని కూడా డిఫైన్ చేసారు. అలాగే సినిమాల‌కు ఫైనాన్స్ చేసేవాళ్ల వ్య‌వ‌హారంపై డ‌కోటా ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. ``ఫైనాన్షియర్లు కొన్నిసార్లు అస్పష్టంగా ఉన్నారు... మ‌న‌కు న‌చ్చే కథలను చెప్పాలనుకుంటే అది కుద‌ర‌దు`` అని అన్నారు. ప‌రిశ్ర‌మ‌లో సృజనాత్మక నియంత్రణ, వాస్తవాల మధ్య సమతుల్యత గురించి మాట్లాడారు. మహిళలు చెప్పే కథలను రూపొందించడంలో నిజాయితీ అవ‌రాన్ని డ‌కోటా గుర్తు చేసారు.

మాతృత్వంపై ఐశ్వర్య రాయ్ స్పీచ్, క్రాఫ్ట్‌పై అనా ఆచరణాత్మక పాఠాలు, లతీఫా వాదన, డకోటా తెరవెనుక క‌థ‌లు అన్నీ ఒకే అంశంగా కలిసిపోయి ఉత్స‌వానికి కొత్త రంగును తెచ్చాయి. రెడ్ సీ 2025 అనేది మహిళల ప్రభావం, తెలివితేటలు- చురుకైన వ్యక్తిత్వాన్ని తెలుసుకునే స్థలంగా భావించాలి.

రెడ్ సీ 2025 అనేది కేవలం ఒక‌ అంతర్జాతీయ ఉత్సవం కాదు. ఇది మహిళలు కేవలం రెడ్ కార్పెట్ మీద నడవడం మాత్రమే కాదు.. వారు ప్ర‌తిదానిని న‌డిపిస్తార‌ని నిరూపించే వేడుక‌. మ‌హిళామ‌ణులు సంస్కృతిని రూపొందిస్తున్నారు. నేటి సినిమాల్లో స్త్రీగా ఉండటం అంటే ఏమిటో రీడిఫైన్ చేస్తున్నార‌ని కూడా వ‌క్త‌లు వ్యాఖ్యానించారు. రెడ్ సీ ఫెస్టివ‌ల్ లో త‌న స్పీచ్ లు, వేష‌ధార‌ణ‌తో ఐశ్వ‌ర్యారాయ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.