Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాపై ఐశ్వర్యరాయ్ అసహనం.. దానినుండి బయటకు రండి అంటూ పిలుపు!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్.. అందంతోనే కాదు తన నటనతో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

By:  Madhu Reddy   |   19 Aug 2025 2:57 PM IST
సోషల్ మీడియాపై ఐశ్వర్యరాయ్ అసహనం.. దానినుండి బయటకు రండి అంటూ పిలుపు!
X

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్.. అందంతోనే కాదు తన నటనతో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బడా హీరోలతో సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. కెరియర్ పీక్స్ లో ఉండగానే.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ తో ఏడడుగులు వేసింది. వివాహం తర్వాత ఒక కూతురికి జన్మనిచ్చిన ఐశ్వర్య.. సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.

రీ ఎంట్రీలో విడాకుల రూమర్స్ తో విసిగిపోయిన ఐశ్వర్యరాయ్..

అలా కొన్నేళ్ల విరామం తర్వాత ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తన అద్భుతమైన నటనతో అందరిని ఆకర్షించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత పెద్దగా సినిమాలలో నటించకపోయినా.. నిత్యం వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలుస్తూ వచ్చింది ఐశ్వర్యరాయ్. తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి దూరం కాబోతోంది అంటూ పలు రకాల రూమర్స్ ఎదుర్కొంది. దీనిపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.. రూమర్స్ మాత్రం ఆగలేదని చెప్పవచ్చు. అయితే అలాంటి ఈమె తాజాగా సోషల్ మీడియాపై అసహనం వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

సోషల్ మీడియా వాడకంపై ఐశ్వర్యరాయ్ అసహనం..

సోషల్ మీడియా వినియోగంపై ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ.."సోషల్ మీడియాపై పెరుగుతున్న మక్కువ చూస్తుంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. గుర్తింపు కోసం ప్రజలంతా ఎక్కువగా దీనిపైనే ఆరాటపడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి లైక్స్, కామెంట్లతోనే మన జీవితాలను నిర్ణయించలేము..ఈ లైక్స్, కామెంట్స్ మనలో ఉండే ఆత్మవిశ్వాసాన్ని బయట ప్రపంచానికి చూపించవు.. నిజమైన అందం అనేది మన మనసులోనే ఉంటుంది. నా దృష్టిలో సోషల్ మీడియా అనేది సామాజిక పరమైన ఒత్తిడి మాత్రమే.. తల్లిగా నేను కూడా ఈ విషయంలో ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటాను.

ఆత్మగౌరవం పెరగాలి అంటే అలా చేయాల్సిందే - ఐశ్వర్యారా

వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా సోషల్ మీడియాకి బానిసలు అవుతున్నారు. దాన్ని దాటి చూసినప్పుడే అసలైన ప్రపంచం కనిపిస్తుంది.ఆత్మగౌరవం కోసం సోషల్ మీడియాలో ఎప్పుడూ వెతకవద్దు.. అది కచ్చితంగా అక్కడ ఉండదు.. దాని నుండి బయటకు రండి అప్పుడే మీ ఆత్మగౌరవం పెరుగుతుంది" అంటూ తెలియజేయడంతో ఐశ్వర్యరాయ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సమాజానికి మంచి మెసేజ్ అంటూ..

ఈ విషయం విన్న నెటిజన్స్ ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యువతకి కావలసిన సరైన మెసేజ్ ఇదే అంటూ చాలా మంది అభిప్రాయంగా తెలుపుతున్నారు. మొత్తానికైతే సోషల్ మీడియా వాడకం అనేది యువతపై ఏ విధంగా ప్రభావం చూపిస్తోంది అనే విషయంపై కూడా స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్యరాయ్.