ఆశీస్సుల కోసం మోదీ పాదాలను తాకిన ఐశ్వర్యారాయ్
ఏపీలోని విశాఖలో ఏర్పాటు చేసిన సిఐఐ సమ్మిట్ 2025 గ్రాండ్ సక్సెసైంది. గూగుల్ డేటా సెంటర్ సహా దాదాపు 20లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వందల కంపెనీలు ఎంవోయులు కుదుర్చుకున్నాయి
By: Sivaji Kontham | 19 Nov 2025 7:08 PM ISTఏపీలోని విశాఖలో ఏర్పాటు చేసిన సిఐఐ సమ్మిట్ 2025 గ్రాండ్ సక్సెసైంది. గూగుల్ డేటా సెంటర్ సహా దాదాపు 20లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వందల కంపెనీలు ఎంవోయులు కుదుర్చుకున్నాయి. ఈ శుభ సందర్భాన సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని సందర్శించారు.
ఆ తరవాత ప్రధాని నరేంద్ర మోదీజీ శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది వేడుకల కోసం పుట్టపర్తికి వెళ్లారు. అక్కడ బాబాను సంద్శించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ప్రధాని మోదీతో పాటు సచిన్ టెండూల్కర్, పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. వీరితో పాటు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కూడా పుట్టపర్తి సందర్శకులలో ఉన్నారు. ఆధ్యాత్మిక స్థలంలోని కుల్వంత్ హాల్‌లోని మహా సమాధిని సందర్శించిన అనంతరం ఐశ్వర్యారాయ్ మీడియాతో మాట్లాడారు.
పుట్టపర్తి లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకి ఐశ్వర్యారాయ్ ఆశీస్సులు తీసుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అనంతరం ఐష్ స్పీచ్ ఆద్యంతం ఆకట్టుకుంది. శ్రీ సత్యసాయి బాబా బోధనలు మంచి కోసం ఒకరికోసం ఒకరు జీవించడం కోసం..ఇది ప్రజలకు అవసరం. వంద సంవత్సరాల తర్వాత కూడా బాబా ఉనికి ఇప్పటికీ సజీవంగా ఉందని , చాలా మందికి మార్గనిర్దేశం చేస్తూనే ఉందని ఆమె అన్నారు. అక్కడ సమావేశంలో మోదీజీ తో పాటు, పవన్ కల్యాణ్, సచిన్ వంటి ప్రముఖులు ఉన్నారు.
ఐశ్వర్యారాయ్ దైవిక సందర్శనం కోసం ఎక్కువగా తిరుమల సందర్శనలో చాలా సార్లు కనిపించారు. ఇప్పుడు పుట్టపర్తి సందర్శనం యాథృచ్ఛికం కాదు. ప్రధాని మోదీతో పాటు ఆ సమయంలో అక్కడ ఉండడం అనేది చాలా ప్రత్యేకమైనది. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ సహా చాలా మంది మోదీజీతో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తారన్న సంగతి తెలిసిందే.
