Begin typing your search above and press return to search.

వంశీపైడిప‌ల్లి ఐశ్వ‌ర్యారాయ్ ని దించే ప్ర‌య‌త్నాల్లో!

కథలో ప్రాధాన్యత ఉన్న ఈ క్యారెక్టర్ కోసం ఐశ్వర్య అయితేనే పూర్తస్థాయిలో న్యాయం చేయగలరని భావించిన వంశీ పైడిపల్లి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.

By:  Srikanth Kontham   |   2 Oct 2026 7:00 PM IST
వంశీపైడిప‌ల్లి ఐశ్వ‌ర్యారాయ్ ని దించే ప్ర‌య‌త్నాల్లో!
X

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ఓభారీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న‌ సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా గ్రాండ్‌గా ప్రారంభమై శ‌ర‌వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సల్మాన్ ఖాన్ మార్క్ మాస్ యాక్షన్, వంశీ పైడిపల్లి కమర్షియల్ హంగులతో రూపొందుతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కథలో ప్రాధాన్యత ఉన్న ఈ క్యారెక్టర్ కోసం ఐశ్వర్య అయితేనే పూర్తస్థాయిలో న్యాయం చేయగలరని భావించిన వంశీ పైడిపల్లి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఆ పాత్ర రూపురేఖలను, ప్రాముఖ్యతను ఆమెకు వివరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ గ‌నుక నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇది ఇండియన్ సినీ చరిత్రలోనే సంచలన ఘ‌ట‌న‌గా మారడం ఖాయం.

సుదీర్ఘ విరామం తర్వాత సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ ఒకే ప్రాజెక్ట్‌లో భాగం కావడం అనేది పాన్-ఇండియా వ్యాప్తంగా ఊహించని రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేస్తుంది. ఈ క్రేజీ కాంబినేషన్ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు చ‌ర్చించుకోవ‌డం మొద‌లు పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ చురుగ్గా సాగుతున్నా? మేకర్స్ కాస్టింగ్ విషయంలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఐశ్వర్య రాయ్‌తో జరుగుతున్న చర్చలు ఎంతవరకు ఫలించాయనే దానిపై ఇంకా అధికారికంగా చిత్ర బృందం స్పందించలేదు.

షూటింగ్ కొనసాగుతున్న తరుణంలోనే బిగ్ అప్‌డేట్‌పై పూర్తి స్పష్టత ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమ వుతున్నట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ మరియు బలమైన పాత్రల చిత్రణ పుష్కలంగా ఉంటుంది. సల్మాన్ ఖాన్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూనే కథకు అనుగుణంగా ఐశ్వర్య రాయ్ లాంటి గ్లోబల్ స్టార్‌ను ప్రాజెక్ట్‌లోకి తీసుకురాగలిగితే సినిమా స్థాయి అంతర్జాతీయంగా పెరుగు తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఆ పాత్ర సినిమా విజయానికి కీల‌కంగానూ మారుతుంది.

ఇక స‌ల్మాన్ ఖాన్ తో ఐష్ న‌టించిన సినిమాల విష‌యానికి వ‌స్తే?..సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ `హమ్ దిల్ దే చుకే సనమ్`లో న‌టించారు. ఈ చిత్రంలో ఇద్ద‌రి నటన, స్క్రీన్ ప్రెజెన్స్ , రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్గా నిలవడమే కాకుండా నేటికీ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అటుపై 2000లో రిలీజ్ అయిన `ఢాయి అక్షర్ ప్రేమ్ కే` చిత్రంలో ఐశ్వర్య సరసన సల్మాన్ అతిథి పాత్రలో కనిపించగా.. 2002లో రిలీజ్ అయిన `హమ్ తుమ్హారే హైన్ సనమ్` సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన ఐశ్వర్య రాయ్ గెస్ట్ రోల్‌‌లో మెరిశారు. పరిమిత చిత్రాల్లోనే కలిసి న‌టించినా? వెండి తెరపై ఇద్ద‌రి కలయిక ఎప్పటికీ మరచిపోలేని మ్యాజికల్ కాంబినేషన్‌గా మిగిలిపోయింది.