Begin typing your search above and press return to search.

పారిష్ ఫ్యాషన్ వీక్ లో ఐశ్వర్యరాయ్.. డ్రెస్ ప్రత్యేకతలు తెలిస్తే గుండె గుబేల్!

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ సెన్స్ తో.. తన పనులతో భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

By:  Madhu Reddy   |   30 Sept 2025 4:51 PM IST
పారిష్ ఫ్యాషన్ వీక్ లో ఐశ్వర్యరాయ్.. డ్రెస్ ప్రత్యేకతలు తెలిస్తే గుండె గుబేల్!
X

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ సెన్స్ తో.. తన పనులతో భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్నామధ్య కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసింది.. హిందూ సాంప్రదాయం ప్రకారం నుదుటిన పెద్ద సింధూరం బొట్టు ధరించి భారతీయ సాంప్రదాయాన్ని ప్రదర్శించిన ఐశ్వర్యరాయ్ ఇప్పుడు మరొకసారి 'నమస్తే' అంటూ అందరిని పలకరించింది.అలా తన వస్త్రధారణతోనే కాదు తన ప్రవర్తనతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది ఐశ్వర్యరాయ్.

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్ 2025 లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. లోరియల్ పారిస్ లే డెఫైల్ షో కోసం రెడ్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది..ముఖ్యంగా సొగసైన నడకతో సిగ్నేచర్ "నమస్తే" డైలాగ్ తో ప్రేక్షకులను ఆకర్షించింది. ఇకపోతే ఇక్కడ ఐశ్వర్య మనీష్ మల్హోత్రా తయారు చేసిన కష్టమ్ మేడ్ రాచరికపు వెల్వెట్ కోట్ ను ధరించింది. దీనిని అత్యంత శక్తివంతమైన ఆండ్రోజెన్స్ స్టేట్మెంట్గా కూడా అభివర్ణించారు.. ఇకపోతే ఈ కోట్ హ్యాండ్స్ పై డైమండ్స్ ను ప్రత్యేకంగా పొదగడం ఇక్కడ ఆశ్చర్యంగా మారింది..ముఖ్యంగా ఈ దుస్తులు సాంప్రదాయ భారతీయ షేర్వా ని తలపించేలా ఉన్నాయి. బ్లాక్ కలర్ లో ఉన్న ఈ డ్రెస్ ఈమె అందాన్ని మరింత హైలెట్ చేసింది అని చెప్పవచ్చు. ఇక కాలానికి అనుగుణంగా గ్లామర్ ను ప్రదర్శిస్తూ.. అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

ఈ రెడ్ కార్పెంటపై కెండాల్ జెన్నర్, హైడీ క్లమ్, యవా లాంగోరియా వంటి తారలతో కలిసి నడిచి ప్రపంచ ఐకాన్ గా మళ్లీ తన హోదాను పునరుద్ఘాటించింది. ఏది ఏమైనా ఈ ఫ్యాషన్ వీక్ లో చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఐశ్వర్యరాయ్.

ఐశ్వర్యరాయ్ విషయానికి వస్తే.. 1994లో మిస్ వరల్డ్ టైటిల్ ను దక్కించుకున్న ఐశ్వర్యరాయ్ భారత సినీ పరిశ్రమలో అత్యధిక ప్రజాదారణ పొందిన నటిగా పేరు దక్కించుకుంది.. ముఖ్యంగా తన ప్రతిభతో, నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది. టైం మ్యాగజైన్ ఈమెను ప్రపంచంలోని వంద మంది అత్యంత ప్రభావంతమైన వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. 2009లో భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు అందుకున్న ఐశ్వర్యారాయ్.. 2012లో ఫ్రాన్స్ ప్రభుత్వం ఈమెకు ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ ను ప్రధానం చేసింది.

1997లో వచ్చిన తమిళ చిత్రం ఇరువర్ అనే సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. కర్ణాటక మంగళూరు కి చెందిన వ్యక్తి. 1998లో వచ్చిన తమిళ చిత్రం జీన్స్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ఎక్కువగా తమిళ్, హిందీ చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఐశ్వర్యరాయ్.