ఆ విషయంలో మహిళలను నిందించకూడదు
ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి, తన అందం, అభినయంతో ఆడియన్స్ ను మెప్పించిన ఐశ్వర్య రీసెంట్ గా ఓ బ్యూటీ బ్రాండ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 28 Nov 2025 6:36 PM ISTమాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి, తన అందం, అభినయంతో ఆడియన్స్ ను మెప్పించిన ఐశ్వర్య రీసెంట్ గా ఓ బ్యూటీ బ్రాండ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ఐశ్వర్య వీధి వేధింపుల గురించి ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడారు. మహిళలు ఎలా కనిపించారు? వాళ్లేం ధరించారనే దానిపై ఎప్పుడూ వారిని నిందించకూడదని చెప్పారు.
ఎప్పుడూ తల వంచొద్దు
ఈ విషయంలో ఆమె సదరు మహిళలకు కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. ఎప్పుడూ మిమ్మల్ని మీరు దాచుకోవద్దని, ఎప్పుడూ తల వంచొద్దని, మిమ్మల్ని మీరు కుంచించుకుపోవడానికి ట్రై చేయొద్దని, మీ తల పైకి ఉంచి, నేరుగా ఎదుటి వ్యక్తి కళ్లల్లోకి చూడమని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మరో వ్యాఖ్య కూడా చేశారు. మీ బట్టలు, లిప్‌స్టిక్ ను మీరెప్పుడూ నిందించొద్దని ఐశ్వర్య తెలిపారు.
ఐశ్వర్య సలహాలు విని ఎంతోమంది నెటిజన్లు ఆన్‌లైన్ లో స్పందించారు. ఇప్పటికైనా ఎవరొకరు ఈ విషయాన్ని చెప్పారు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఈ విషయంపై మాట్లాడినందుకు ఐశ్వర్యకు థ్యాంక్స్ చెప్తున్నారు. అయితే ఈ విషయంలో ఓ వర్గం ప్రజలు మాత్రం ఐశ్వర్య వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ కూడా వీధి వేధింపుల విషయంపై ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు.
కానీ మరికొందరు మాత్రం వారి అభిప్రాయాలను తీవ్రంగా ఖండిస్తూ, ఐశ్వర్య చెప్పిందే నిజమని, ఎవరు ఎలాంటి బట్టలు ధరించాలనేది పూర్తిగా ఆ మహిళ డిసిషన్ పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఐశ్వర్య కెరీర్ విషయానికొస్తే ఆమె ఆఖరిగా పొన్నియన్ సెల్వన్2 లో కనిపించి ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో కొత్త సినిమాలేమీ లేకపోయినా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
